S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/20/2018 - 02:00

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 19: అఖిల భారత స్థాయిలో గేట్-2018లో భువనచంద్ర ప్రథమ ర్యాంక్ సాధించడం తెలుగువారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. సోమవారం సచివాలయంలో పునుకొల్లు భువనచంద్ర తన తల్లిదండ్రులతో సహా ముఖ్యమంత్రిని కలిశారు. ఈసందర్భంగా భువనచంద్రను చంద్రబాబు సత్కరించి బుద్ధుని విగ్రహం బహూకరించారు.

03/20/2018 - 01:42

రాజమహేంద్రవరం, మార్చి 19: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న సాంఘిక నాటికలు సమాజానికి సందేశాలను ప్రబోధిస్తున్నాయి. నాటకోత్సవాల ఆరో రోజైన సోమవారం ప్రదర్శించిన రెండు నాటికలు అందరినీ ఆలోచింపజేశాయి. స్వాతంత్య్రం అంటే ఒక పాలన పోయి మరో పాలన రావడం కాదు, స్వేచ్ఛగా, నిజాయితీగా బతికే స్వాతంత్య్రం కావాలని చాటిచెప్పింది ‘ఫ్రీడం ఫైటర్’ నాటిక.

03/20/2018 - 01:39

కాసిపేట, మార్చి 19: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న సమయంలో నిజాం కాలంనాటి వెండి నాణేలు బయటపడ్డాయ. కూలీలు గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు పనులను చేస్తుండగా ఈ నాణేలు లభ్యమయ్యాయ. ఈ మేరకు దేవాపూర్ పోలీసులకు సమాచారం అందటంతో ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

03/20/2018 - 01:37

హైదరాబాద్, మార్చి 19: ఆల్ ఇండియా సైనిక్ పాఠశాల 6వ తరగతి (2018-19) సంవత్సరానికి సంబంధించి జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాల తుది జాబితాలో హైదరాబాద్‌కు చెందిన రవణం చరణ్ శ్రీవర్ధన్ (రోల్ నెం.65103010088) 3వ ర్యాంక్ సాధించాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయలో ఈ ఏడాది జనవరి 7వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 9వేల మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 200 మందిని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

03/20/2018 - 03:18

హైదరాబాద్: రైతులకు ఉచిత పెట్టుబడిని అందించే పథకాన్ని వచ్చే 19న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి వెల్లడించారు. ఆలోగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో ఆధునీకరించిన భూ వివరాలను ఈ నెల 28లోగా వ్యవసాయశాఖకు అందించాల్సిందిగా రెవిన్యూశాఖను సిఎస్ ఆదేశించారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయానికి ఉచిత పెట్టుబడిని అందించే కార్యక్రమంపై రెవిన్యూ,

03/20/2018 - 03:20

ఆదిలాబాద్/మహబూబ్‌నగర్: ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పదవ తరగతి ఇంగ్లీషు మొదటి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో అధికార్లు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ జెడ్పీ పాఠశాలలో, మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ బాలికల పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఈ పరీక్షా ప్రతాలు లీకయ్యాయి.

03/20/2018 - 01:09

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణలో అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల సాయం పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ పథకం కింద ఇస్తున్న సాయాన్ని 1,00,116 రూపాయిలకు పెంచుతున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం నాడు శాసనసభలో ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.

03/20/2018 - 03:22

నంద్యాల: నిషేధిత బీటీ-3 విత్తనాలనే బీటీ-2 పేరుతో విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. పర్యావరణం, భూగర్భ జలాలతో పాటు పంట పొలాలకు ప్రమాదకరంగా మార్చే బీటీ-3 పత్తి విత్తనసాగు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో యధేచ్చగా జరుగుతోంది. నకిలీ విత్తనమాఫియా, వ్యవసాయాధికారులు కుమ్మక్కై అమాయక రైతులను బుట్టలో వేసుకుని దేశంలో నిషేధించిన బీటీ-3 విత్తన పత్తిని గుట్టుచప్పుడు కాకుండా బీటీ-2 పేరుతో సాగుచేయిస్తున్నారు.

03/20/2018 - 00:57

విజయవాడ, మార్చి 19: అవిశ్వాస తీర్మానంపై అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నామని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్ర హక్కుల కోసం ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని, ఇది కీలక సమయమని ఉద్ఘాటించారు. ఈ అవకాశం చేజారకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

03/20/2018 - 00:26

విజయవాడ, మార్చి 19: ప్రతి పేదవానికి అభివృద్ధి ఫలాలు అందేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలను ముందుకు తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోడానికి కృషి చేస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు పి రంజిత్ బాషా అన్నారు.

Pages