S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/20/2018 - 00:09

విశాఖపట్నం, మార్చి 19: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఈ సంస్థ ఆస్తులను మదించేందుకు వాల్యుయేటర్లను సోమవారం ఇక్కడికి పంపించింది. ముంబైకి చెందిన ప్రొటోకాల్ ఇన్స్యూరెన్స్ సర్వేయర్స్ అండ్ లాస్ ఎసెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రంగంలోకి దిగింది. వీరికి ఆర్‌బీఎస్‌ఎ ట్రాంజాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది.

03/19/2018 - 22:24

భీమవరం, మార్చి 19: నరసాపూర్-విశాఖపట్నం (నెం.17241, 17242) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం నుంచి రద్దుచేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. నరసాపూర్ నుండి ప్రతి రోజూ ఉదయం ఆరు బోగీలతో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ రైలును లింకు ఎక్స్‌ప్రెస్‌గా గత కొన్ని దశాబ్దాలుగా నడుపుతున్నారు. ఈ రైలు నిడదవోలు చేరుకున్నాక, గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఆరు బోగీలను కలిపేశారు.

03/20/2018 - 02:23

హైదరాబాద్, మార్చి 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బిజెపితో తాము జత కట్టినట్లు టిడిపి దుష్ప్రచారం చేస్తున్దని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఒంటరిగా గెలవలేని టిడిపి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు.

03/19/2018 - 17:54

హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. శ్రీరామ రథయాత్ర పేరిట విహెచ్‌పీ కార్యకర్తలు చేస్తున్న యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు దుకాణాలు వేశారు. రథయాత్రను కోటీ వద్దకు తీసుకరావటంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయని పోలీసులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది కార్యకర్తలను అరెస్టు చేశారు.

03/19/2018 - 17:26

విజయవాడ: ఏపీ టెట్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 4,14,120 మంది టెట్‌ పరీక్ష రాశారని, పేపర్-1లో 57.88 శాతం, పేపర్-2లో 37.26 శాతం.. పేపర్-3లో 43.60 శాతం మంది అర్హత సాధించారని గంటా తెలిపారు. ఫలితాల వివరాలను https://cse.ap.gov.in, aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.

03/19/2018 - 16:41

గుంటూరు: జిల్లాలోని వినుకొండలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తుండగా వినుకొండ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 7.25 లక్షలు ఉంటుంది. 24 బస్తాల గుట్కా ప్యాకెట్లు, 4లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

03/19/2018 - 16:42

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ్యుల రద్దు కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటన దృశ్యాలను ఈనెల 22లోగా సమర్పించాలని హైకోర్టు ఆ ఉత్తర్వులలో పేర్కొంది. వారం రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తే ఏమన్నా అభ్యంతరమా? అని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

03/19/2018 - 13:38

విశాఖపట్నం: తమ వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన సోమవారంనాడిక్కడ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇకపై ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫీయాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఏడాది రైల్వే జోన్ ఏర్పాటు అవుతుందని అన్నారు.

03/19/2018 - 12:27

హైదరాబాద్ : మూడు రోజుల సెలవుల అనంతరం రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి ప్రారంభించారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

03/19/2018 - 12:18

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. నిరుపేదలకు అండదండగా నిలిచే సీఎం కేసీఆర్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని శాసనసభ వేదికగా సీఎం ప్రకటించారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

Pages