S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/18/2018 - 02:52

భద్రాచలం టౌన్, మార్చి 17: కోదండ రాముడు కొలువుదీరిన భద్రగిరిలో ఆదివారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 26న శ్రీరామ కల్యాణం, 27న పట్ట్భాషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

03/18/2018 - 02:04

హైదరాబాద్, మార్చి 17: ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది అందరి జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం రాత్రి రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పండుగల వెనుక శాస్ర్తియ సందేశం ఉంటుందని, అందులో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. తెలుగువారికి నూతన సంవత్సరం ఉగాదేనన్న విషయం కూడా చాలామందికి తెలియదని అన్నారు.

03/18/2018 - 02:00

ఒంటిమిట్ట, మార్చి 17: ఏకశిలపై వెలసిన శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా ఒంటిమిట్ట ముస్తాబవుతోంది. త్రేతాయుగంలో జాంబవంతునిచే ఏకశిలపై ప్రతిష్ఠించబడిన శ్రీ సీతారామలక్ష్మణులు భక్తకోటి నీరాజనాలందుకుంటున్నారు. పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణం నిర్వహించడం ఒంటిమిట్ట ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు స్వామివారి కల్యాణం నిర్వహిస్తుంటారు.

03/18/2018 - 04:21

విశాఖపట్నం: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనే ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు అన్నారు. విశాఖ ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘రూల్ ఆఫ్ లా’ అంశంపై ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని, ప్రపంచంలో ఏ దేశానికీ లేని అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు.

03/18/2018 - 01:43

పి.వి. రమణారావు

03/18/2018 - 04:23

హైదరాబాద్: దేశానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐటి రంగం ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.1 లక్ష కోట్లు దాటే అవకాశం ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఐటి రంగం అభివృద్ధికి రూపొందించిన ఐటి పాలసీ ఫ్రేమ్ వర్క్‌తో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐటి రంగంలో హైదరాబాద్ స్థానం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే సుస్థిరంగా ఉండడమేకాకుండా ఎటువంటి మాంద్యానికి లోనుకాకుండా పైపైకి ఎగబాకుతోంది.

03/18/2018 - 01:26

హైదరాబాద్, మార్చి 17: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత తొలి అడుగుగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీతో మంతనాలు జరిపేందుకు ఈనెల 19న కోల్‌కతా వెళ్ళనున్నారు.

03/18/2018 - 04:21

రాజమహేంద్రవరం: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గతం కంటే భేషుగ్గా వుందని పోలవరం నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం (సిబ్ల్యుసి) ఛైర్మన్ సయ్యద్ మసూద్ హుసేన్ పేర్కొన్నారు.

03/18/2018 - 00:48

హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవిళంబి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలను వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు తెలిపారు.

03/17/2018 - 17:21

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. నాలుగు కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. మొత్తం 25 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఓటింగ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Pages