S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/23/2018 - 03:32

హైదరాబాద్: రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం రెండు రకాల యాండ్రాయిడ్ మొబైల్ యాప్‌లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ గురువారం ఆవిష్కరించారు. దీంతో పాటు కాచిగూడ రైల్వే స్టేషన్ పైన ఏర్పాటు చేసిన 400కెడబ్ల్యూపి ఆన్‌గ్రిడ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎం రెండు యాప్‌లను ఆవిష్కరించారు.

03/23/2018 - 02:27

హైదరాబాద్, మార్చి 22: సిబిఐ మాజీ జాయింట్ డైరక్టర్ (జెడి), మహారాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం అదనపు డిజి హోదాలో పని చేస్తున్న లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్)కు దరఖాస్తు చేశారు. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర డిజిపికి అందజేశారు. ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం విఆర్‌ఎస్‌కు అనుమతించాల్సి ఉంది. స్వచ్ఛంధ ఉద్యోగ విరమణ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని సమాచారం.

03/23/2018 - 02:20

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి నిధులు కేటాయించడంలో పోటీపడుతున్నాయి. 2017-18లో ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో 10 శాతం, ఆంధ్ర రాష్ట్రం 8 శాతం నిధులు కేటాయించాయి. సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన తరగతుల సంక్షేమం ఉన్నాయి.

03/23/2018 - 01:45

హైదరాబాద్, మార్చి 22: ఉన్నత విద్యాసంస్థలపై ని యంత్రణను సరళీకృతం చేసే క్రమంలో దేశవ్యాప్తంగా 60 విద్యాసంస్థలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పూ ర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 13 సంస్థలకు ఈ అవకాశం దక్కింది. జాతీయ స్థాయి గ్రేడ్-1 స్థాయిలో రెండు యూనివర్శిటీలు నిలవగా, అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కూడా ఆ ఘనతను దక్కించుకుంది.

03/23/2018 - 01:56

హైదరాబాద్, మార్చి 22: ప్రముఖ నిర్మాత, పంపిణీదారు డు, దర్శకుడు సంగిశెట్టి దశరథ (66) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గ త కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం సికింద్రాబాద్ బోయన్‌పల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శివాజీ గణేశన్, రాధ నటించిన ‘ఆత్మబంధువు’ చిత్రంతో దర్శరథ సినిమా రంగంలోకి ప్రవేశించారు.

03/23/2018 - 01:11

రాజమహేంద్రవరం, మార్చి 22: కుటుంబం మధ్య ఆత్మీయతలు అంతర్జాలానికి పరిమితమైపోతున్నాయి.. పెరిగిన సాంకేతికత కుటుంబ బంధాలను తెంచేస్తోందని సమకాలీన కుటుంబాల్లోని పరిస్థితులను కథా వస్తువుగా తీసుకుని ప్రస్తుత సామాజిక విశృంఖలత్వాన్ని చక్కగా ఆవిష్కరించింది ‘ప్రపంచం నీ గుప్పెట్లో’ నాటిక.

03/23/2018 - 01:09

ఖమ్మం, మార్చి 22: భద్రాచలంలో రాములోరి కల్యాణం ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నది. సీతారామచంద్రుడు విళంబినామ సంవత్సరంలోనే జన్మించాడని, ఈ ఏడాది కూడా విళంబి నామ సంవత్సరమే కావడం శుభసూచకమని, కల్యాణాన్ని వీక్షిస్తే శుభం జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది కల్యాణానికి లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

03/23/2018 - 00:57

నేరేడుచర్ల, మార్చి 22: ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపగా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న శాసనసభ్యులను సస్పెండ్, రద్దుచేయడం ప్రజాతీర్పుకు అవమానమని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత పార్లమెంట్‌లో, అసెంబ్లీలోగాని ఇలాంటి దుస్సంఘటన జరగలేదని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

03/23/2018 - 00:56

ఉర్సు ఉత్సవాల సందర్భంగా అజ్మీర్ దర్గాకు సమర్పించే
చద్దర్‌ను సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా చద్దర్‌ను
తలపై మోస్తూ కొద్దిసేపు నడిచారు.

03/23/2018 - 03:35

హైదరాబాద్: తెలంగాణలో టీ హబ్‌ను ఐదు నగరాలకు విస్తరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో గురువారం నాడు వెల్లడించారు. పువ్వాడ అజయ్‌కుమార్, బీగాల గణేశ్, గాదరి కిశోర్‌కుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పా రు. రెండో టీహబ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా ఆవిర్భవిస్తుందని వెల్లడించారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికే టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను నెలకోల్పామన్నారు.

Pages