S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/21/2018 - 01:43

హైదరాబాద్, మార్చి 20: జెబిఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని, దీని గురించి ఎటువంటి అపోహలు అక్కర్లేదని ఐటి శాఖ మంత్రి కే టీ రామారావు స్పష్టం చేశారు. ఇంతవరకు మెట్రో రైలు నిర్మాణానికి రూ.14132 కోట్లు ఖర్చయిందని, ఇందులో రాష్ట్రప్రభుత్వం వాటా రూ.2296 కోట్లన్నారు. కేంద్రం నుంచి కూడా సంస్థకు రూ.1450 కోట్ల నిధులు అందుతున్నాయన్నారు.

03/21/2018 - 01:40

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్టు , ఏ ఒక్క మంచి పనీ జరగలేదన్నట్టు అడ్డగోలుగా మాట్లాడొద్దు అంటూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మంగళవారం శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత కె లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు.

03/21/2018 - 03:58

విజయవాడ(బెంజిసర్కిల్): తన ఇమేజ్‌తో పాటు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పరువునష్టం దావా అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

03/21/2018 - 03:58

భీమవరం: రాష్ట్ర విభజన అనంతరం విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ నెలకొల్పాలని ఒకపక్క పోరాటం సాగుతుంటే మరోపక్క ఒక్కొక్కటిగా ఉన్న సౌకర్యాలను రద్దుచేస్తూ రైల్వే శాఖ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం నుంచి రైల్వే శాఖ రద్దుచేసింది.

03/21/2018 - 01:20

గుంటూరు, మార్చి 20: హేతుబద్ధతలేని విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని, రాజ్యాంగపరంగా హక్కులు, హామీలు నెరవేర్చాలని అడుగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తెగేసి చెప్పారు.ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిందే ఏపీకి ఇవ్వమని అడిగామని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని అన్నారు. ‘అయినా చర్చకు కూడా తావులేకుండా చేస్తారా..

03/20/2018 - 15:30

అమరావతి: నటులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, తమిళ నటీనటులను చూసి అయినా తెలుగు చిత్రసీమ బుద్ది తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..

03/20/2018 - 13:42

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి బీజేపీ నేత ఆర్ లక్ష్మీపతి రాజీనామా చేశారు. అసెంబ్లీలో సీఎంని కలిసిన ఆయన తన రాజీనామా లేఖను అందించారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగటంతో తాను కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

03/20/2018 - 12:56

అమరావతి: వెనుకబడిన జిల్లాల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. నిధులు ఎందుకు వెనక్కి తీసుకున్నారంటూ పలువురు టీడీపీ సభ్యులు గట్టిగా అడిగారు. అయితే... దీనిపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... సాంకేతికపరమైన అంశమే కానీ కేంద్రం కావాలని చేయలేదని పేర్కొన్నారు.

03/20/2018 - 04:34

ఖమ్మం: వరుస దాడులతో తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులు, పోలీసు జవాన్లు పరస్పరం పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సామాన్య జనం ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా సోమవారం తెల్లవారుఝామున చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తుమ్‌నార్ - కోయిట్‌పల్లి మధ్య రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న 6 వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు.

03/20/2018 - 02:04

శ్రీకాకుళం, మార్చి 19: నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చే మే నాటికి సొంత భవనాల్లో ఎసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు పూర్తయ్యాయని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో రూ. 1.05 కోట్లతో అన్ని వసతులతో ఎసీబీ కార్యాలయం నిర్మించామన్నారు. రాష్ట్రంలో 354 కొత్త పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.

Pages