S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/16/2018 - 16:52

గుంటూరు: అతిసార వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జనసేన నేత పవన్ కల్యాణ్ శుక్రవారంనాడు పరామర్శించారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే గుంటూరు బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో టిడిపి, వైసీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

03/16/2018 - 16:50

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జర్నలిస్ట్ సంఘాల నేతలతో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో భేటీ అయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం వంద కోట్లు మంజూరు చేస్తాననటం సంతోషించదగ్గ విషయం అన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

03/16/2018 - 16:48

అమరావతి:నైతికతను పాటించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, ఏపీకి అన్యాయం జరిగింది. న్యాయం చేస్తానని ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు శాసనసభలో మాట్లాడుతూ..అవిశ్వాసం పెడతామని కొందరు డ్రామాలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరెవరితోనో నాపై విమర్శలు చేయిస్తున్నారు.

03/16/2018 - 14:20

కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఇవాళ ప్రారంభించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ సెంటర్ లో ఉచితంగా సేవలు పొందవచ్చు అని తెలిపారు.

03/16/2018 - 13:43

విజయవాడ: మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన వ్యక్తి పొట్టిశ్రీరాములు అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విజయవాడ కృష్ణలంక మెట్లబజారులోని ఆయన విగ్రహానికి పవన్‌కల్యాణ్‌ అంజలి ఘటించారు.

03/16/2018 - 02:56

మణుగూరు: మణుగూరు- కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ నూతన రైలు సర్వీస్ ప్రారంభోత్సవానికి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆజ్మీరా సీతారాంనాయక్, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

03/16/2018 - 02:15

ఖమ్మం, మార్చి 15: జమ్ము కాశ్మీర్‌లో ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వాసిగా గుర్తించటంతో జిల్లాలో ఒక్కసారిగా నిషేధిత ఐసిస్ కలకలం రేగింది. అనంతనాగ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా అందులో కొత్తగూడెం జిల్లాకు చెందిన మహ్మద్ తౌఫిక్ ఉన్నట్లు నిర్ధారించారు.

03/16/2018 - 01:11

దేశంలో ప్రతిభ గలవారికి కొదవలేదు. కళాకారులతోపాటు కార్మికులు కూడా తమకు అబ్బిన నైపుణ్యంతో అబ్బురపరచే ఆవిష్కరణలను సృష్టించగలరు. చేనేత చీరను మడిచి అగ్గిపెట్టెలో పెట్టిన దృశ్యాల్ని మనం చూశాం. అలాంటిదే ఈ ‘దబ్బనంలో దూరే చీర’. వేములవాడకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ తన ప్రతిభతో అమ్మవారి కోసం దబ్బనంలో దూరే చీరను నేసి గురువారం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో రాజేశ్వర్‌కు అందజేశారు.

03/16/2018 - 01:03

సిద్దిపేట, మార్చి 15: భద్రాద్రి రామునిపై వివాదాలు సృష్టించడం అవివేకమని.. భద్రుని కోరిక మేరకే నారాయణుడే రాముని రూపంలో అవతరించినట్లు శాస్త్రాలు, పురాణాలు, వేదాలు చెపుతున్నాయని త్రిదండి అహోబిల రామానుజజీయర్ స్వామి పేర్కొన్నారు. గురువారం సిద్దిపేటలో పర్యటన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. రాముడు నారాయణుడేనని.. భద్రాద్రి రాముడు నారాయణుడేనని ఆయన స్పష్టం చేశారు.

03/16/2018 - 01:00

రాజమహేంద్రవరం, మార్చి 15: నాటక సమాజాల్లో నిపుణులైన నటీనటులంతా వార్ధక్యానికి చేరువయ్యారు. కొత్త తరం ఈ సమాజాల దరి చేరడం లేదు. దీంతో ఆయా సమాజాల్లో మెజార్టీ నటీనటులంతా వానప్రస్థానానికి చేరుకుంటున్నారు. యువతరం కనీసం వారి వారసత్వాన్ని కూడా అందుకోలేని స్థితి కనిపిస్తోంది.

Pages