S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/17/2018 - 17:10

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ శ్రీవిళంబినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవిళంబినామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను అని గవర్నర్ పేర్కొన్నారు.

03/17/2018 - 16:58

రాజమండ్రి: ప్రతిపక్ష నేత జగన్ ఫిర్యాదుల వల్లే పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుందని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం పోలవరం ప్రాజెక్టు పనులపై సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలవరం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పారు.

03/17/2018 - 16:56

విశాఖ: విశాఖ మీదుగా కోస్తా ఆంధ్రామీద అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

03/17/2018 - 16:55

గుంటూరు: ప్రత్యేక హోదా అంశం రాజకీయ సమస్యగా మారిందని సిపిఎం నాయకులు మధు అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అవకాశవాద రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని అన్నారు. పవన్ వామపక్షాలతో కలవడం అభినందనీయమని, ఆయనతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడతామని తెలిపారు.

03/17/2018 - 16:55

హిందూపురం: తన నియోజకవర్గమైన హిందూపురంలో ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ శనివారంనాడు విస్తత్రంగా పర్యటించారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏంజిఏం ఇండోర్ స్టేడియానికి భూమి పూజ చేశారు. అంతకుముందు ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించమని కోరగా.. ఒకరిని సూపర్ స్టార్‌ను చేయటం ఇష్టం లేదు. మేమే సూపర్‌స్టార్లం అని బదులిచ్చారు.

03/17/2018 - 16:54

విజయవాడ: గుడివాడ దంపతుల హత్య కేసులో కీలక మలుపు జరిగింది. పధకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు.

03/17/2018 - 14:04

హైదరాబాద్ : మహిళలకు నాయకత్వ లక్షణాలు ఉండాలని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నగరంలోని పార్క్‌హయత్‌లో నల్సార్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహిళా లీడర్‌షిప్ సమ్మిట్ -2108 జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఉండాలన్నారు.

03/17/2018 - 13:43

విశాఖ : జిల్లాలోని నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరుగుదొడ్డి ట్యాంకులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నీటిని తొడుతుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. ఆయనను రక్షించేందుకు మరో నలుగురు వ్యక్తులు మరుగుదొడ్డి ట్యాంకులోకి దిగారు. దీంతో ఊపిరాడక ఐదుగురిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

03/17/2018 - 12:44

అమరావతి: కేసుల మాఫీకే విజయసాయిరెడ్డి పీఎంవోలో తిరుగుతున్నారని, దానికి ప్రతిగానే జగన్ కేసులలో సడలింపులు వస్తున్నాయని, రేపోమాపో జగన్ కేసులు కొట్టివేస్తారనే ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి న్యాయం జరగడమే మన లక్ష్యమన్నారు.

03/17/2018 - 03:16

హైదరాబాద్: విద్యుత్ రంగానికి ఢోకాలేదు. నిధుల లేమి లేదు. 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు నిధుల లోటు లేకుండా చూడడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. 2017-18 బడ్జెట్‌తో పోల్చితే, అదనంగా 340 కోట్ల నిధులను విద్యుత్ సబ్సిడీ కింద అదనంగా కేటాయించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రప్రభుత్వం గుర్తించింది.

Pages