S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/06/2017 - 07:41

హైదరాబాద్, మార్చి 5: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావుపై అభియోగాలు గుప్పుమంటున్నాయి. నరుూంతో సంబంధాలున్నట్టు గుర్తించిన సిట్ అధికారులు ఆదివారం విద్యాసాగర్‌రావును విచారించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల సేపు అతణ్ని విచారించి నరుూంతో సంబంధాలపై ఆరా తీసినట్లు తెలిసింది. నిరుడు ఆగస్టు 8న నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

03/06/2017 - 04:59

ఆశించింది 31శాతం..సాధించింది 10శాతం

నోట్ల రద్దు, భూముల అమ్మకం జరుగకపోవడమే కారణం
తగ్గిన ఆదాయంతో మిగులు బడ్జెట్ సాధ్యమేనా?

03/06/2017 - 04:57

హైదరాబాద్, మార్చి 5: మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార పక్షంతో పాటు విపక్షాలు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గడచిన 30నెలల్లో ఇప్పటి వరకు అధికార పక్షాన్ని పెద్దగా ఇరకాటంలో పెట్టే అంశాలు విపక్షాలకు చిక్కలేదు. విద్యుత్ సమస్య లేకపోవడం, వర్షాలు బాగుండడం ప్రభుత్వానికి ప్రధానంగా కలిసి వచ్చిన అంశాలు.

03/06/2017 - 04:56

హైదరాబాద్, మార్చి 5: సుప్రసిద్ధ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆలయానికి రెండో ప్రాకారం, ఇతర నిర్మాణాలు ఆగమ, వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాల డిజైన్లను కర్నాటకలోని శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామికి అధికారులు చూపించారు. దేవాదాయ శాఖ కమీషనర్ శివశంకర్, వేములవాడ టెంపుల్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ యం.

03/05/2017 - 04:03

నల్లగొండ రూరల్, మార్చి 4: ఉన్నతాధికారుల దర్పం ఒక్కోసారి చిరుద్యోగులకు చిన్నచూపుగా మారుతుంది. నల్లగొండ పట్టణ పరిధిని చారిత్రక పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయాలు, పానగల్ టూరిజం మ్యూజియం పరిశీలనకు శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రావడం జరిగింది.

03/05/2017 - 04:01

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి రాష్టమ్రంతా ఒకే జోన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది. జోనల్ వ్యవస్థ వల్ల తలెత్తే పరిణామాలు, రాష్ట్రంలో నిరుద్యోగులకు కలిగే ప్రయోజనాలు, అలాగే నష్టం వాటిల్లుతుందన్న వర్గాల వారి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఒక ముసాయిదా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది.

03/05/2017 - 04:00

హైదరాబాద్, మార్చి 4: మహిళలపై వేధింపులను అరికట్టేందుకే షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని, ఎవరైనా మహిళల జోలికి వస్తే జైలుపాలు కాక తప్పదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పీపుల్స్ ప్లాజాలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్, చైల్డ్ ఎక్స్‌పోను ఆయన ప్రారంభించారు.

03/05/2017 - 03:57

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చీకటి రోజు అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం వల్ల తెలుగు రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

03/05/2017 - 03:52

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతోందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంగాధర్‌గౌడ్, ఫారుఖ్ హుస్సేన్ విమర్శించారు. యాత్రలు చేసినట్టుగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి ఏదో మాట్లాడి వెళుతున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని దిగ్విజయ్‌సింగ్ ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.

03/05/2017 - 03:51

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ అసెంబ్లీకి కొత్త వనె్న రాబోతున్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు అసెంబ్లీ వెబ్‌సైట్ కేవలం ఇంగ్లీషులోనే ఉన్నది. తాజాగా శాసనమండలి కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ తెలుగు, ఉర్దూలోనూ వెబ్‌సైట్ ప్రారంభించాలన్న ఆలోచన చేశారు. దీంతో రీసెర్చ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి ప్రభృతులతో కలిసి ఆయన దీనిని సంపూర్ణం చేశారు.

Pages