S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/10/2017 - 03:53

కడెం,జనవరి 9: నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు, ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాకపోవడం కడెం ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది. నిజానికి ఈనెల 7న ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే రబీ పంటలకు ఇక నీరివ్వవలసిన అవసరం లేదని ఒక ప్రాంత రైతులు అభిప్రాయ పడుతూంటే కనీసం మూడునాలుగురోజులైనా నీరిస్తే పంటలు చేతికొస్తాయని మరొక ప్రాంత రైతులు కోరుతున్నారు.

01/10/2017 - 03:50

కరీంనగర్, జనవరి 9: ప్రభుత్వ వసతి గృహాలకు సరుకులు అందించే గుత్తేదారులు అక్రమాలకు పాల్పడితే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. అవినీతి రహిత పాలనే ప్రభుత్వ లక్ష్యమని, సరుకులు సరఫరా చేసే గుత్తేదారులపై దృష్టి సారించాలని, ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించవద్దని అధికారులకు సూచించారు.

01/10/2017 - 03:47

కోరుట్ల, జనవరి 9: అరబిక్ భాష నేర్చుకునేందుకు వెడుతున్న ఆరేళ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి పరారవగా 40 నిమిషాల్లో అతడిని పట్టుకున్న పోలీసులు ఆ చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. కోరుట్ల పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. జగిత్యాల ఎస్పీ అనంతశర్మ ఈ కేసు వివరాలు వెల్లడించారు.

01/10/2017 - 03:45

హైదరాబాద్, జనవరి 9: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 3వ తేదీన ఛలో పార్లమెంటు నిర్వహిస్తున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, కార్యదర్శి కోట రమేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

01/10/2017 - 03:45

హైదరాబాద్, జనవరి 9: నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర ప్రజా సమస్యలపై మరింత ఉద్ధృతంగా ఉద్యమించేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి కార్యాచరణ కమిటీని ఎఐసిసి ప్రకటించింది.

01/10/2017 - 03:44

హైదరాబాద్/ముషీరాబాద్, జనవరి 9: మిర్యాలగూడను జిల్లాగా, హుజూర్‌నగర్‌ను రెవెన్యూ జిల్లాగా ప్రకటించే వరకు నిరంతరం ఉద్యమం కొనసాగిస్తామని జిల్లా సాధన కమిటీ వెల్లడించింది. ఈమేరకు మిర్యాలగూడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల అఖిలపక్ష జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది.

01/10/2017 - 03:44

హైదరాబాద్, జనవరి 9: తనకు 50 రోజుల గడువు ఇస్తే నోట్ల కష్టాలు తీర్చడమే కాకుండా నల్లకుబేరులను పట్టేసుకుని విప్లవాత్మకమైన మార్పులు తెస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నీటి మూటలే అయ్యాయని ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు విమర్శించారు. 50 రోజులు కాదు కదా 60 రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.

01/10/2017 - 03:43

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారని ఆయన చిత్రపటాలకు తమ సంఘం తరఫున పాలాభిషేకం చేస్తున్నట్టు టిజి సిసిఎల్‌ఎ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కనక చంద్రశేఖర్ పేర్కొన్నారు.

01/10/2017 - 03:42

హైదరాబాద్, జనవరి 9: ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించి విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఇందుకు కెసిఆర్ యువతకు క్షమాపణ చెప్పాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉచితంగా కెజిటు పిజి అంటున్నారే తప్ప డిఎస్సీని నిర్వహించటం లేదని ఆయన విమర్శించారు.

01/10/2017 - 03:35

హైదరాబాద్, జనవరి 9: గురు శిష్యుల అనుబంధం చాలా గొప్పదని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. విలువలతో కూడిన విద్యనూ అందించడం గురువుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో జరుగుతున్న 77వ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కాన్ఫరెన్స్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాల్గొన్నారు.

Pages