S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/10/2017 - 02:55

హైదరాబాద్, జనవరి 9: ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుండి తొలగించే ముందు సమగ్ర విచారణ జరిపించాల్సి ఉంటుందని హైకోర్టు సోమవారం నాడు పేర్కొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జూనియర్ కాటన్ పర్చేజర్స్‌గా 2015లో నియమితులైన ఉద్యోగులను కార్పొరేషన్ తొలగించిందని పేర్కొంటూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

01/09/2017 - 04:33

మహబూబ్‌నగర్, జనవరి 8:మనదేశంతోసహా ప్రపంచం అంతటా కుల, మత, జాతి, ప్రాంతీయ కారణాల రీత్యా యుద్ధకాంక్ష పెరిగిపోయిందని, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఈ వైఖరి విపరీత పరిణామాలకు దారితీస్తోందని కేంద్ర మాజీ మంత్రి సూదిన జైపాల్‌రెడ్డి అన్నారు. దీనివల్ల చాలా ప్రాంతాల్లో శాంతి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఒక్కరే దీనికి మినహాయింపని ఆయన అన్నారు.

01/09/2017 - 04:32

కొత్తకోట, జనవరి 8: ట్యూషన్‌కు వెళుతున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల్లో ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలకు కాగా, మరొకరు అదేవయసున్న బాలుడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి రాగా నిందితుడిని గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

01/09/2017 - 04:31

శంషాబాద్, జనవరి 8: విద్యారంగాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ 2వ రాష్ట్ర మహాసభ ముగింపు కార్యక్రమానికి హజరైన కోదండరామ్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు దాసోహమైన ప్రభుత్వం విద్యరంగాన్ని పూర్తిగా భ్రస్టుపట్టించిందని అన్నారు.

01/09/2017 - 04:31

వాంకిడి, జనవరి 8: టేకు కలప, వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులు, అటవీప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన ఇనుపఖనిజంతో అందమైన వస్తువులు, ఫర్నిచర్ తయారీలో శిక్షణ ఇచ్చి గిరిజనులకు ఉపాధి చూపి దేశవ్యాప్తంగా పేరుపొందిన సంస్థ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి కామన్ ఫెసిలిటి సెంటర్ (సిఎఫ్‌సి). ఐటిడిఎ ఆధ్వర్యంలో 1979లో ఏర్పడిన ఈ సంస్థ 2012 వరకు నిరాఘాటంగా పనిచేసి ఎంతోమందికి ఉపాధి చూపింది.

01/09/2017 - 04:29

పరకాల, జనవరి 8: భూపాలపల్లి ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఉన్న అపారమైన బొగ్గు నిక్షేపాలు వెలికి తీసేందుకు కొత్త గనులను ప్రారంభించడానికి సింగరేణి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంతంలో కొత్తగా 1.3 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. మరో 150 ఏళ్లవరకు భూపాలపల్లి ప్రాంతానికి తిరుగుండదని చెబుతున్నారు.

01/09/2017 - 04:27

మిరుదొడ్డి, జనవరి 8: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలోని కెజిబివి కేంద్రంలో ఆదివారం మధ్యా హ్న భోజనం తిన్న విద్యార్థినులలో 50మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 30 మంది స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వీరందరినీ మొదట మిరుదొడ్డిలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి తెరచిలేకపోవడంతో ప్రైవేట్ అసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు.

01/09/2017 - 04:27

హైదరాబాద్, జనవరి 8: గుండె ఆపరేషన్లలో కొత్త సాంకేతిక వైద్య విధానాలు అమలులోకి వచ్చాయని ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విజయ దీక్షిత్, డాక్టర్ విఏ సుబ్రమణియన్‌లు ప్రకటించారు.

01/09/2017 - 04:26

హైదరాబాద్, జనవరి 8: జంట కమిషనరేట్ల పరిధిలో పక్షం రోజుల్లో 9 మంది పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, ఠాణాకు వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలపై 9మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

01/09/2017 - 03:34

యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడ, బాసర, పాపన్నపేట, జనవరి 8: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ వైకుంఠ ఏకాదశి శోభతో మెరిసిపోయాయి. విష్ణుస్వరూపుడైన స్వామివారిని ఉత్తరద్వార దర్శనంతో తిలకించి భక్తులు పులకించిపోయారు. యాదగిరిగుట్ట బాలాలయంలో స్వామివారు తూర్పు ద్వార దర్శనమివ్వగా పాతగుట్ట ఆలయంలో ఉత్తరద్వార దర్శనమివ్వగా భక్తులను కరుణించడం విశేషం.

Pages