S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/09/2017 - 04:02

ఒంటిమిట్ట/తిరుపతి, జనవరి 8 : కలియుగ వైకుంఠ నాధుడు కొలువదీరిన తిరుమల క్షేత్రంలోను, అక్కడికి సమీపంలోని కడప జిల్లా ఒంటిమిట్టలోను ఆదివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో వేంకటేశుడు దర్శనమిస్తే ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడి రూపంలో వైకుంఠద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు.

01/09/2017 - 03:12

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ ప్రభుత్వం ముచ్చటగా నాల్గవసారి భారీ ఎత్తున తాయిలాలతో ఎన్నికల బడ్జెట్‌ను వచ్చే నెలాఖరు లేదా మార్చిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గత మూడు బడ్జెట్‌లలో సంక్షేమం, భారీ సాగునీటిపారుదలకు పెద్ద పీట వేసిన కెసిఆర్ సర్కార్ 2017-18 సంవత్సరానికి కూడా విపక్షాలకు ఆయుధం లేకుండా చేసే విధంగా బడ్జెట్‌ను సమర్పించేందుకు చకచకా పావులు కదుపుతోంది.

01/09/2017 - 03:11

న్యూఢిల్లీ, జనవరి 8: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ నూతన రెసిడెంట్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బాధ్యతలు స్వీకరించానున్నారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అరవింద్‌ను ఇటీవల తెలంగాణ పభుత్వం ఢిల్లీకి బదిలీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న శశాంక్ గోయల్ నుండి అరవింద్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

01/09/2017 - 03:11

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులపై కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, ఆయా విభాగాల్లోని డిఐజీలు, ఐజీలు, ఏడిజీలుగా ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం.

01/09/2017 - 02:58

హైదరాబాద్, జనవరి 8: విద్యుత్ వేడి, కాలుష్యంతో భూతాపం పెరిగిపోతోందని, ప్రస్తుతం మన ముందున్న కాలుష్యం సమస్యే కీలకమైందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతన్నారు. ఆదివారం లక్డికాపూల్‌లోని సువిధ సూపర్ మార్కెట్‌లో ఆయన 35కెవి సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ మిత్రలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించడం ముదావహమన్నారు.

01/09/2017 - 02:56

హైదరాబాద్, జనవరి 8: నాగ్‌పూర్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగిన నేషనల్ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్-2017 పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన మాస్టర్ ఆర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. అండర్ 13 కేటగిరీలో ఈ పతకం చేజిక్కించుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూలులో రాజా రుత్విక్ 8వ తరగతి చదువుతున్నాడు. 9 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి నేషననల్ రన్నర్ అప్‌గా నిలబడ్డాడు.

01/09/2017 - 02:55

హైదరాబాద్, జనవరి 8: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంస్థలను అణచివేస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆవిర్భావ సభ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

01/09/2017 - 02:54

హైదరాబాద్, జనవరి 8: వచ్చే నెల 11 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరుగనున్న అయిదు- ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల విధులు నిర్వహించే కీలక నోడల్ అధికారులకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ సివి ఆనంద్ దిశానిర్దేశం చేశారు.

01/09/2017 - 02:52

హైదరాబాద్, జనవరి 8: ‘మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ముగిసిన కథ కాదు..’ అని విపక్ష నేతలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హెచ్చరించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ముగిసిన కథ అని లోగడ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ నేతలు మండిపడ్డారు. మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

01/08/2017 - 08:52

రామడుగు, జనవరి 7: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం, దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం, ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియోలో ఒకరి ద్వారా ఒకరికి విస్తృత ప్రచారం జరగడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...ఈ సం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pages