S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/08/2017 - 08:51

హైదరాబాద్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐ ముసుగులో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల సందర్భంగా లబ్ది పొందేందుకు ఆ రాష్ట్రాలకు ఎక్కువ నగదును పంపిస్తున్నదని ఆయన శనివారం పార్టీ నాయకుడు జి. నిరంజన్‌తో కలిపి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

01/08/2017 - 08:51

మేళ్లచెర్వు, జనవరి 7: నల్లగొండ జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని చింత్రియాల గ్రామం వద్ద కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్టు వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ నది ఒడ్డున నీళ్లలో పడగా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. హుజూర్‌నగర్ నుండి గుంటూరు జిల్లాకు బాయిల్డ్ బియ్యంతో వెళ్తున్న లారీ చింత్రియాల వద్ద బల్లకట్టును ఎక్కించేందుకు క్రమంలో అదుపుతప్పి నది వడ్డున ఉన్న నీటిలో పడింది.

01/08/2017 - 07:23

హైదరాబాద్, జనవరి 7: తెలంగాణలో సర్కిల్ ఇనెస్పెక్టర్లు, డిఎస్పీల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. అధికారుల పదోన్నతి కోసం గత ఏడాది డిసెంబర్ 13న పోలీసు శాఖ సీనియారిటీ జాబితాను రూపొందించింది. దీనిపై ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్ క్యాడర్ ఎస్పీగా పనిచేస్తున్న పివి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంస్ రామచంద్రరావు విచారించారు.

01/08/2017 - 07:22

హైదరాబాద్, జనవరి 7: మత్స్య పరిశ్రమాభివృద్ధికి కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకంపై అవసరమైన కార్యాచరణ యుద్ధప్రాతిపదికన రూపొందించాలని ప్రగతి భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో అధికారులను ఆదేశించారు.

01/08/2017 - 07:20

హైదరాబాద్, జనవరి 7: సంక్రాంతి సంబరాలకు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో, జనం నిలువు దోపిడీకి ‘ప్రైవేట్’ సైతం సమాయత్తమైంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే జనాన్ని ప్రైవేట్ బస్సులు దోపిడీ చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ఆర్టీసీ సంస్థలు పెద్దఎత్తున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూనే, ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు తప్పదని ప్రకటించాయి. ఆంధ్రకు వెళ్లే రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ నాలుగు నెలల క్రితమే ముగిసింది.

01/07/2017 - 04:45

యాదగిరిగుట్ట, జనవరి 6:యాదాద్రి క్షేత్ర అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా ఈ క్షేత్రం విలసిల్లుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని గవర్నర్ దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

01/07/2017 - 04:43

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ రాష్ట్రంలో 35,92,134 మందికి ఆసరా పథకం కింద పించన్లు అందిస్తున్నామని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వృద్ధులు సంతకాలు చేయలేకపోతే ఐరిస్‌ను సేకరించి వారికి పెన్షన్ చెల్లిస్తామని అన్నారు.

01/07/2017 - 04:43

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ లాబీలో శుక్రవారం కడియం శ్రీహరి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియమ నిబంధనలు ఎలా ఉండాలి అనే ఆలోచిస్తున్నామని, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావడం మాత్రం ఖాయం అని అన్నారు. దేశ వ్యాప్తంగా 254 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని చెప్పారు.

01/07/2017 - 04:42

హైదరాబాద్, జనవరి 6: విద్యార్ధులకు హాస్టల్ మెస్ ఛార్జీలను మానవీయ కోణంతో ఆలోచించి పెంచాలని శుక్రవారం నాడు శాసనసభలో విపక్షాలు కోరాయి. టిడిపి నేత రాగ్యా కృష్ణయ్య, బిజెపి నేత జి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్ తదితరులు మెస్ చార్జీలు పెంచాలని కోరారు.

01/07/2017 - 04:41

హైదరాబాద్, జనవరి 6:అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్‌ను ఎంపి కవిత సందర్శించారు. చేనేతకు ప్రోత్సహించడానికి, ప్రచారం కల్పించడం కోసం 40వేల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా అమె కోసం, తన తల్లి కోసం వస్త్రాలు కొన్నట్టు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి లాబీలో జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.

Pages