S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/07/2017 - 01:52

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నాయకత్వ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బోధన రంగంలో ఉపాధ్యాయులను మరింత సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఇందుకోసం మానవ వనరుల బృందాన్ని ఎస్‌సిఇఆర్‌టి ఏర్పాటు చేస్తోంది.

01/07/2017 - 01:52

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో భూసేకరణ కోసం 2013 చట్టాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 123 జివోను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నిలిపి వేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నదని టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

01/07/2017 - 01:51

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణలో అర్హత ఉన్న ప్రైవేటు బిఇడి కాలేజీలను విద్యా చట్టం 1982 సెక్షన్ 20 కింద సంబంధిత విశ్వవిద్యాలయాలకు అనుబంధం చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

01/07/2017 - 01:50

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 6: అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చజరుగుతుండగా సిఎం, సభావ్యవహారాల మంత్రి హరీష్‌రావు, కెటి ఆర్‌లు లేకపోవడం వారికి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసిందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. అతి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే వారు లేకపోవడం దారుణం. ప్రతిపక్ష నాయకులు అడిగే ప్రశ్నలకు సిఎం సమాధానం ఇవ్వాలి.

01/07/2017 - 01:49

హైదరాబాద్, జనవరి 6:ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు సైతం సబ్ ప్లాన్ నిధులు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.

01/06/2017 - 04:14

కేసముద్రం, జనవరి 5: రాత్రిపూట విద్యుత్ సరఫరా రైతుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. పంటలు కాపాడుకోవాలంటే నీరుపెట్టాలి. అర్ధరాత్రైనా సరే కరెంటు వచ్చినపుడే ఆ పని చేయాలి. అందుకే ఎంత రాత్రయినా చేలకు రైతులు వెళుతున్నారు. ఒక్కోసారి వారు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి సంఘటనే కేసముద్రంలో జరిగింది.

01/06/2017 - 04:14

హైదరాబాద్, జనవరి 5: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని యువకుడు తాను ధరించిన చొక్కాను చించి తాడులా మార్చుకుని ట్యాంక్‌బండ్‌పై గల అన్నమయ్య విగ్రహం వెనుక భాగంలో ఉన్న చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

01/06/2017 - 04:11

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 13 నుండి 15 వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తెలిపారు. 16వ తేదీన కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని అన్నారు. సెలవుల్లో కాలేజీలు ఎలాంటి తరగతులు నిర్వహించడానికి వీలు లేదని ఆయన చెప్పారు.

01/06/2017 - 04:10

సిద్దిపేట, జనవరి 5: ప్రిన్సిపాల్ మందలించాడని విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో గు రువారం జరిగింది. సిద్దిపేట మండలం పుల్లూరు కు చెందిన ఎర్రోళ్ల వెంకట్‌గౌడ్ కుమార్తెలు భవాని(17), శివాని(16) సాయిచైతన్య జూ. కళాశాలలో ఇంటర్మీడియట్ సిఇసి చదువుతున్నారు. బుధవారం బస్‌పాస్ రెన్యువల్ కోసం భవాని స్నేహితురాలి దగ్గర నుంచి వంద రూపాయలు అప్పుగా తీసుకుంది.

01/06/2017 - 04:09

హైదరాబాద్, జనవరి 5: సింగరేణి కాలరీస్‌లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిజెపి నేత జి కిషన్‌రెడ్డి గురువారం శాసనసభలో డిమాండ్ చేశారు. సింగరేణిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొంటూ సింగరేణి గనుల్లో అక్రమాలు జరిగాయని, వస్తువుల కొనుగోలు, ఇసుక తవ్వకాలలో కూడా అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Pages