S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/07/2017 - 04:40

హైదరాబాద్, జనవరి 6: ‘అసెంబ్లీలో నాది ధర్మరాజు పాత్ర, భీముని పాత్రను మా ఎమ్మెల్యేల్లో అవసరాన్ని బట్టి మారుతుంటారు..’ అని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. శుక్రవారం జానారెడ్డి కొంత సేపు ఉల్లాసంగా, హుషారుగా గంటకు పైగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నవ్వించారు. మీకు నెల రోజులకు సరిపోయేంత క్లాసు తీసుకున్నానని, మీ మైండ్‌లు ఇప్పుడు రీప్రెష్ అయ్యాయని మరోసారి నవ్వించారు.

01/07/2017 - 02:33

హైదరాబాద్, జనవరి 6: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఎంతైతే చెప్పిందో అంత చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వ్యయమే నిదర్శనం అని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి విమర్శించారు.

01/07/2017 - 02:31

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో అడవులు రికార్డుల ప్రకారం 25శాతం విస్తీర్ణంలో ఉన్నా, వాస్తవానికి పది పదకొండు శాతానికి మించి లేవని పేర్కొంటూ, దీనిపై ఏం చేయాలో అంతా కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం శాసన సభలో అన్నారు.

01/07/2017 - 02:30

హైదరాబాద్, జనవరి 6: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అన్ని కులాల వారి అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

01/07/2017 - 02:28

హైదరాబాద్, జనవరి 6: సర్కారు ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూస్తూ అవమాన పరుస్తోందని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభమైన మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణానికి చెందిన రాజీవ్ శర్మకు మూడుసార్లు పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం దళిత సామాజికవర్గానికి చెందిన ప్రదీప్‌చంద్రకు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు.

01/07/2017 - 02:27

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ శాసనసభ ఈ నెల 17, 18 తేదీల్లో కూడా సమావేశం కాబోతోందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శాసనసభలో చెప్పారు. తెలంగాణ ఆరో శాసనసభ సమావేశాలు పదహారో రోజు శుక్రవారం వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశాలు సంక్రాంతి అనంతరం 17వ తేదీన ప్రారంభం అవుతాయి. రెండు రోజుల పాటు కొనసాగిన తర్వాత నిరవధికంగా వాయిదా పడుతాయని తెలిసింది.

01/07/2017 - 02:06

న్యూఢిల్లీ, జనవరి 6: హైదరాబాద్‌కు సమీపంలోని బీబీనగర్‌లో ఏర్పాటు చేయాల్సిన అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్) ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్‌లో చేర్చాలని టిఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఇద్దరు ఎంపీలు శుక్రవారం కేంద్ర కేంద్ర వైద్య శాఖ మంత్రి జెపి నడ్డాను కలిసి వినతి పత్రం అందజేశారు.

01/07/2017 - 01:59

న్యూఢిల్లీ,జనవరి 6: తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. బిజెపి రెండు రోజుల జాతీయ కార్యవర్గం సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన లక్ష్మణ్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు.

01/07/2017 - 01:57

హైదరాబాద్, జనవరి 6: గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు జరుగనున్న ఆల్ ఇండియా ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్-2017ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అటవీశాఖ మంత్రి జోగు రామన్న శుక్రవారం సాయంత్రం శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించాల్సిందిగా కోరారు.

01/07/2017 - 01:54

సంగారెడ్డి, జనవరి 6: గోవుల్లో అత్యంత అరుదైన దియోని జాతి ఆవుల మనుగడకు పెద్దప్రమాదం ముంచుకొచ్చింది. జహీరాబాద్ మండలంలో ఆ జాతి ఆవుల సంరక్షణ కేంద్రానికి నిధులు నిలిపివేయడంతో అక్కడున్న 46 దియోని జాతి ఆవుల పరిస్థితి అగమ్యగోచరమైంది. రోడ్డుపై మేతకోసం వెంపర్లాడుతున్న ఆ గోవులు కబేళాకు తరలించేస్తారేమోనన్న అందోళన స్థానికుల్లోల వ్యక్తమవుతోంది.

Pages