S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/03/2016 - 03:42

న్యూఢిల్లీ, డిసెంబరు 2: జిఎస్‌టి బిల్లులోని వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులను చేర్చాలని కేంద్రానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ ఐదవ సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.

12/03/2016 - 03:38

హైదరాబాద్/ అల్వాల్, డిసెంబర్ 2: ఇద్దరు ఆటోడ్రైవర్ల వేధింపులు భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ సిఐ ఆనందరెడ్డి కథనం ప్రకారం ఓల్డ్ అల్వాల్ కుమ్మరిబస్తీ నివాసి, ఆటోడ్రైవర్ బాలరాజు ఆటోను రోజు వారీ కిరాయికి నర్సింహ వద్ద తీసుకుని నడిపిస్తున్నాడు.

12/03/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కార్మిక , ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షులు కె సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలవ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు చెప్పారు.

12/03/2016 - 03:33

హైదరాబాద్/కుషాయిగూడ, డిసెంబర్ 2: చెక్కులు డ్రా చేస్తానని చెప్పి తీసుకున్న బ్యాంక్ ఎండి ఆ మొత్తాన్ని ఖాతాదారుకు ఇవ్వకుండా తానే డ్రా చేసుకున్న ఉదంతం ఇది. ఏఎఎస్‌రావునగర్ నవభారత్ బ్యాంకులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎఎస్‌రావునగర్‌కు చెందిన సుడుగు మహేందర్‌రెడ్డి నవభారత్ ప్రైవేట్ బ్యాంకులో బావమరిది పెళ్ళి కోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు.

12/03/2016 - 03:33

హైదరాబాద్/హయత్‌నగర్, డిసెంబర్ 2: భూదాన్‌బోర్డు భూములను అక్రమంగా విక్రయించాడనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు హయత్‌నగర్ పోలీసులు భూదాన్‌బోర్డు మాజీ చైర్మెన్ రాజేందర్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయితీ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ పరిధిలోని పాపాయిగూడ సర్వే 215, 224లోని భూదాన్ భూమిలో అర్హులైన వారికి పట్టాలు ఇవ్వకుండా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

12/03/2016 - 03:27

నాచారం, డిసెంబర్ 2: తెలంగాణ ఉద్యమానికి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత్‌చారి వర్ధంతిని యువత ఉపాధి దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరిపించాలని జెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయులో జరిగిన శ్రీకాంత్‌చారి వర్ధంతి సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న యువకులను కెసిఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

12/02/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర, పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మ గురువారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా ప్రదీప్ చంద్ర గవర్నర్‌ను కలిసినట్టు అధికార వర్గాల సమాచారం.

12/02/2016 - 04:11

కరీంనగర్, డిసెంబర్ 1: ఆసరా పథకంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు బీడీ, గీత కార్మికుల్లో పె(టె)న్షన్ మొదలైంది. ఇప్పటివరకు ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీలోపల పింఛన్ డబ్బులు అందిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇకమీదట ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఉంటాయని ప్రకటించడంతో పింఛన్‌దారుల్లో ఆందోళన మొదలైంది.

12/02/2016 - 04:11

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 1: పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును అందుబాటులోకి తెచ్చి 20 రోజులు గడుస్తున్నా.. ప్రజలకు కరెన్సీ కష్టం తప్పడం లేదు. ‘కొత్త’ నోటుకు బ్యాంకుకు వెళితే సిబ్బంది తీరు వల్ల ఆసుపత్రి పాలయ్యారు. పైకానికి పోతే ప్రాణం మీదకు తెచ్చారు. సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్దకు డబ్బుల కోసం గురువారం వెళ్లిన ప్రజలు బారులు తీరారు.

12/02/2016 - 04:07

హైదరాబాద్, చాదర్‌ఘాట్, డిసెంబర్ 1: మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు గురువారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మిర్చి, ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆన్‌లైన్ మార్కెట్‌పై అధికారులకు, రైతులు, గుమస్తాలు, కమీషన్ ఎజెంట్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Pages