S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/04/2016 - 04:01

భద్రాచలం, డిసెంబర్ 3: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్‌జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు.

12/03/2016 - 04:16

హైదరాబాద్, డిసెంబర్ 2: పంట రుణాల మాఫీ వాయిదాను బ్యాంకులకు విడుదల చేసినా రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని బ్యాంకర్లపై రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలు, రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలని నిబంధనలున్నా 11 శాతం ఎలా వసూలు చేశారని బ్యాంకర్లను మంత్రి నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను అమలు చేయని బ్యాంకర్లకు తాఖీదులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

12/03/2016 - 04:13

నార్కట్‌పల్లి, డిసెంబర్ 2: జెనెటిక్ మాలిక్యులర్ డయాగ్నసిస్ ఇన్ మోడ్రన్ మెడిసిన్ పేరుతో అంతర్జాతీయ వైద్యుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కామినేని వైద్యుల బృందం పేర్కొంది.

12/03/2016 - 04:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తెలంగాణలోని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. శుక్రవారం నాడు చెన్నమనేని పౌరసత్వం వివాదం కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

12/03/2016 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో 2886 బాల్యవివాహాలను నిలిపివేసి వారి సంరక్షణ, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ప్రకటించింది. త్వరలో మహిళా హెల్ప్‌లైన్ 181ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. పిల్లల దత్తత ప్రక్రియ సరళీకృతం చేశామని, 449 మంది పిల్లలను దత్తతకు ఇచ్చామని, 45 మంది పిల్లలను విదేశీయులకు దత్తతకు ఇచ్చినట్లు ఆ శాఖ పేర్కొంది.

12/03/2016 - 04:09

హైదరాబాద్, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 20న ఇందిరా పార్కు వద్ద తమ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నిరసన దీక్ష చేయనున్నట్లు ఆయన చెప్పారు.

12/03/2016 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వాటిపై ఉద్యమాలను ఇక ఉద్ధృతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. యువకులకు ఉద్యోగాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించిందని, ఫీజు రియంబర్స్‌మెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

12/03/2016 - 04:08

సిద్దిపేట, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా సిద్దిపేటను మార్చేందుకు ప్రజాప్రతినిధులు కంకణబద్ధులై ఉండాలని.. క్యాష్‌లెస్‌గ్రామంగా మొదట చేసిన గ్రామానికి 10లక్షల నజరానా ఇస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

12/03/2016 - 04:07

హైదరాబాద్, డిసెంబర్ 2: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. గతంలో విధించిన రుసుంపై అదనంగా 20 శాతం చెల్లించి తాజాగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు కూడా మున్సిపల్‌శాఖ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.

12/03/2016 - 03:44

జిన్నారం, డిసెంబర్ 2. ఐరన్ పరిశ్రమలో ఫర్నెన్స్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని విజయా ఐరన్ పరిశ్రమలో చోటు చేసుకుంది. శుక్రవారం మూడవ షిఫ్టులో విధులు నిర్వహిస్తూ ఉండగా పరిశ్రమలోని ఫర్నెస్ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో ఫర్నెస్‌లోని లిక్విడ్ ఐరన్ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పడింది.

Pages