S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/06/2016 - 14:01

హైదరాబాద్: నగరంలోని చింతల్‌లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ నిర్మించిన రెండు భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం సీజ్ చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ భవనాల్లో ప్రస్తుతం రెండు కార్పొరేట్ కళాశాలలు నడుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భవనాలను ఎమ్మెల్యే గౌడ్ నిర్మించారని ఆయన సమీప బంధువులు కోర్టులో పిటిషన్ వేశారు.

08/06/2016 - 11:42

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు మంత్రులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

08/06/2016 - 11:36

హైదరాబాద్: పంద్రాగస్టు వేడకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు ఎయిర్‌పోర్టులో మోహరించారు.

08/06/2016 - 07:49

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా 16శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.

08/06/2016 - 07:36

గద్వాల, ఆగస్టు 5: ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నామని చెబుతుండగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం రేవులపల్లి పుష్కరఘాట్ వద్ద కొట్టొచ్చినట్టు కన్పించింది. రేవులపల్లి గ్రామం కృష్ణానది సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ వద్ద భక్తులకు 40 తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేశారు.

08/06/2016 - 07:35

జిన్నారం, ఆగస్టు 5: ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై పెట్రోల్‌పోసి నిప్పంటిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గురువారం ఈ ఘటన మెదక్ జిల్లా పరిధిలోని బొల్లారంలో జరిగిన విష యం తెలిసిందే. కాగా ఘట నలో క్షతగాత్రులైన బాధి తులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందు తుండగా తండ్రి సుంకయ్య (42), కుమారుడు వీరేష్ (5) శుక్రవారం మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

08/06/2016 - 07:34

నల్లగొండ, ఆగస్టు 5: తెలంగాణ జాగృతి బహుముఖ లక్ష్య సాధనలో స్వరాష్ట్ర సాధన తొలి అడుగు మాత్రమేనని, రాష్ట్రాన్ని దేశంలో అన్నింటా అగ్రగామిగా నిలపడమే జాగృతి అంతిమ లక్ష్యమని సంస్థ అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నల్లగొండలో ప్రారంభమైన రెండు రోజుల తెలంగాణ జాగృతి 10వ వార్షికోత్సవ రాష్ట్ర ప్రతినిధుల సభలను ఆమె ప్రారంభించి ప్రసంగించారు.

08/06/2016 - 07:25

టేకులపల్లి, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో శుక్రవారం పోలీసుల సాయంతో ఫారెస్టు అధికారులు దాదాపు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి అందులో హరితహారం పేరుతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఫారెస్టు బలగాలు మోహరించడంతో ఒడ్డుగూడెం వణికిపోయింది.

08/06/2016 - 07:24

గజ్వేల్, ఆగస్ట్ 5 : ప్రధాని నరేంద్రమోదీ పర్యటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబందాలు బలోపేతమై బంగా రు తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు పడతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/06/2016 - 07:23

సంగారెడ్డి, ఆగస్టు 5: మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో పర్యటించడానికి వస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభకు వెళ్లకుండా సాంఘిక బహిష్కరణ చేసేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం చేసేందుకు వెళ్లిన నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే.

Pages