S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/21/2016 - 08:31

హైదరాబాద్, జూన్ 20: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల సంఖ్య 14కంటే ఎక్కువ చేయడం కుదరదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సిబ్బంది, వౌలిక సదుపాయాలపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మార్గనిర్దేశం చేశారు. అవసరమైనచోట రెవిన్యూ డివిజన్లు, మండలాలను పెంచుకోవచ్చు. కానీ మొత్తం జిల్లాల సంఖ్య మాత్రం 24-25 మధ్యనే ఉంటుందని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు.

06/21/2016 - 08:30

మాగనూర్, జూన్ 20: తెలంగాణ, కర్నాటక సరిహద్దులో కృష్ణానదిపై నిర్మించిన వంతెనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో 40 రోజుల పాటు తెలంగాణ, కర్నాటకలకు ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

06/21/2016 - 08:24

వరంగల్, జూన్ 20: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందని, రాబోయే మూడు సంవత్సరాల్లో 5వేల కోట్లతో శాశ్వత భవనాలు, వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో 4.32 కోట్లతో నిర్మించిన మోడల్ స్కూల్ భవన సముదాయాన్ని, బాలికల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు.

06/21/2016 - 08:23

నిజామాబాద్, జూన్ 20: గంజాయి రవాణాకు రుచిమరిగిన స్మగ్లర్లు తమ దందాను యథాతథంగా కొనసాగించేందుకు అనేక ఎత్తుగడలు అవలంబిస్తున్నారు. ఇటీవలి కాలంలో అటు ఆంధ్రాతో పాటు ఇటు తెలంగాణలోనూ గంజాయి స్మగ్లింగ్‌పై ఎక్సైజ్, పోలీస్ అధికారుల నిఘా తీవ్రం కావడంతో గంజాయి నిల్వలను సరిహద్దులు దాటించేందుకు సరికొత్త మార్గాలను అనే్వషిస్తున్నారు.

06/21/2016 - 08:06

హైదరాబాద్, జూన్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. బిహెచ్‌ఇఎల్, ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పంపు హౌజ్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ఖరారు చేశారు.

06/21/2016 - 08:04

హైదరాబాద్, జూన్ 20: నిమ్స్ ఆస్పత్రిలో లివర్, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ టవర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిమ్స్‌లో అధునిక బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన తరువాత మంత్రి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు.

06/21/2016 - 08:03

హైదరాబాద్, జూన్ 20: ఇంజనీరింగ్ అడ్మిషన్లలో అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను అనాలోచితంగా ఇవ్వడం వల్ల వారు కోరుకున్న సీట్లు రాక విద్యాసంవత్సరాన్ని నష్టపోయే పరిస్థితి ఉంది. ఏపిలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలో జూన్ 22 నుండి ఈ ప్రక్రియప్రారంభం కానుంది. ఆంధ్రాలో ఎంసెట్ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి కూడా తేదీలను ఖరారు చేశారు.

06/21/2016 - 07:35

హైదరాబాద్, జూన్ 20: వ్యాపార వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారానికి చైనాలోని హైనన్ ప్రావిన్స్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయు కుదిరింది. ఐటి మంత్రి కె తారక రామారావు సమక్షంలో కుదిరిన ఒప్పందంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలంగాణ తరఫున, హైనన్ గవర్నర్ లియుసిగుయ్ హైనన్ తరఫున సంతకాలు చేశారు. ఐటి పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరాయ.

06/21/2016 - 07:34

నిర్వాసితులకు న్యాయం చేయండి ఎకరాకు 8 లక్షలు పరిహారమివ్వాలి లేదా ప్రత్యామ్నాయ భూమి కేటాయంచండి
మల్లన్నసాగర్ నిర్వాసితుల డిమాండ్ సమస్యపై ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు 48గంటలు దీక్ష చేస్తా: రేవంత్‌రెడ్డి

06/21/2016 - 07:34

అంతకంటే ఎక్కువ సాధ్యం కాదు
సిరిసిల్లకు ఓకే.. విస్తీర్ణంలో కొమరం భీమ్ టాప్
అయినా తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే
సిబ్బంది కేటాయంపునకు సాధికారిక కమిటీ
తక్కువైనా సరిపెట్టుకోక తప్పదు..
రెండు జిల్లాలకు అయితే సిబ్బంది ఓకే
మూడు జిల్లాలు ఏర్పడేచోటే ఇబ్బంది
వౌలిక వసతుల అవసరంపై నివేదికలు
కలెక్టర్ల సమావేశంలో సిఎస్ మార్గనిర్దేశం

Pages