S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2016 - 13:47

ఆదిలాబాద్: ప్రచారం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం తప్ప తెరాస పాలనలో సంక్షేమం కానరావడం లేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, విపక్షాలను అణచివేయడమే కెసిఆర్ ప్రధాన ఎజెండా అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి ఉందని, ప్రజల కోసం ప్రధాని మోదీ చేసిన త్యాగం ఎమిటని ఆయన ప్రశ్నించారు.

06/20/2016 - 13:47

హైదరాబాద్: అత్తాపూర్‌లో సోమవారం పర్యటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ను కార్పొరేటర్ జంగయ్య వర్గీయులు అడ్డుకున్నారు. వీరిద్దరూ తెరాసలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. జంగయ్య వర్గీయులు అడ్డుకోవడాన్ని ఎమ్మెల్యే మద్దతుదారులు ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

06/20/2016 - 13:45

హైదరాబాద్: అధికారుల్లో సమన్వయ లోపం వల్ల హైదరాబాద్ నగర ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని రహదారుల తీరుపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షించారు. వివిధ శాఖ అధికారులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నందున పాడైన రహదారులతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు.

06/20/2016 - 12:04

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అంబర్‌పేట నాలాలో మురుగునీటిలో పోలియో వైరస్‌ టైప్‌ 2 వెలుగులోకి రావడంతో యుద్ధప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం పోలియో టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పోలియో అత్యవసర టీకాల కార్యక్రమం సోమవారం నుంచి ఏర్పాటుచేసింది. రెండు జిల్లాల్లోనూ ఈనెల 26 వరకూ వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

06/20/2016 - 12:00

హైదరాబాద్: ఎంఫిల్, పిహెచ్‌డి ప్రవేశాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలను బహిష్కరించి వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు.

06/20/2016 - 11:59

హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని నినాదాలు చేస్తూ ఎబివిపి నేతృత్వంలో సోమవారం ఉదయం మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు విద్యార్థులు యత్నించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల్లోకి చొరబడేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.

06/20/2016 - 11:58

కరీంనగర్: ఓ వాహనంలో తరలిస్తున్న అయిదు లక్షల రూపాయల కలపను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న కలపను వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద సీజ్ చేశారు.

06/20/2016 - 11:57

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే సిద్ధమైన ముసాయిదా ప్రతిపాదనలపై నేడు, రేపు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో క్షుణ్ణంగా చర్చిస్తారు. కలెక్టర్ల ప్రతిపాదనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజవ్ శర్మ సమీక్షించాక ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తారు. దానిపై కీలక నిర్ణయాన్ని సిఎం కెసిఆర్ తీసుకుంటారు.

06/20/2016 - 07:56

హైదరాబాద్, జూన్ 19: మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ‘్భరోస’ పేరిట ఓ వినూత్న పథకాన్ని రూపొందించింది. నెల రోజుల క్రితం రాజధాని నగరంలోని హాకా భవన్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 23మంది సిబ్బందితో ఏర్పాటైన ఈ కేంద్రంలో న్యాయ సలహా, కౌనె్సలింగ్, గృహ హింసకు సంబంధించి కేసులను పరిష్కరిస్తారు.

06/20/2016 - 07:29

హైదరాబాద్, జూన్ 19: నగరంలోని సుల్తాన్ బజార్‌లో గత రాత్రి ఓ వ్యాపారి నుంచి రూ. 12 లక్షలు దోచుకెళ్లిన ఐదుగురు దొంగలను ఈస్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలు అపహరించిన చోరీ కేసును 12 గంటల లోపే పోలీసులు ఛేదించారు. రాజధాని టైర్స్ షో రూమ్ అధినేత దినేష్ సింగ్ తన నగదు రూ. 12 లక్షలతో బైక్‌పై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వ్యాపారి బైక్‌ను ఢీకొట్టారు.

Pages