S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

07/17/2016 - 01:18

బాలీవుడ్‌లో వచ్చిన ‘ద డర్టీపిక్చర్’, ‘కహానీ’ చిత్రాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ వైవిధ్యభరితమైన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి నటిగా నూటికి నూరుపాళ్లు తన పాత్రలకు న్యాయం చేసి అందరిచేత ‘వాహ్..’ అనిపించుకుంది నటి విద్యాబాలన్. తాజాగా విద్యా బాలన్ ఇండియన్-ఇంగ్లీష్ నవలా రచయిత కమలాదాస్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రంలో నటిస్తోంది.

07/10/2016 - 04:38

అని యువతరం ఎప్పుడు అంటుందో ఏమో అని అనుకుంటున్నారా? ‘అంత సీన్ లేదులే’ అంటున్నారు టాలీవుడ్ జనాలు. టీవీ యాంకర్‌గా ఎంతో పాపులర్ అయిన రేష్మి తన అందచందాలతో..పదునైన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ‘జబర్‌దస్త్‌గా’ తనవైపునకు ఆకట్టుకునేలా చేసింది. అయితే అంతటితో ఆగకుండా, మరో అడుగు ముందుకేసి వెండితెరపై తన ప్రతిభను చూపడానికి సిద్ధమయింది.

07/10/2016 - 04:36

ఆర్మీ కుటుంబంలో పుట్టిపెరిగిన అనుష్కాశర్మ మొదట మోడల్‌గా రాణించి అటుపై వెండితెర మీద అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో..మరెన్నో ఆలోచనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలన్నదే ఈ అమ్మడి తపన. అదృష్టం తలుపుతడితే ఎవ్వరూ ఆపలేరు. తొలి చిత్రం ‘రబ్ నే బనాదీ జోడీ’లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

07/10/2016 - 04:35

వెండితెరపై వెలుగులు విరజిమ్మాలనీ..ఎంతో ఎత్తుకు ఎదిగి బాగా డబ్బు సంపాదించేయాలనీ..కెరీర్‌లో వెనక్కు తొంగిచూడకుండా పరుగులు పెట్టాలనీ చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రతీ తారా కలలుగంటూనే వుంటుంది. అయితే కొంతమంది భామలకు ఇది మినహాయింపు. అలాంటి మినహాయింపులో కొత్త అందం సురభి ఒకరు.

07/10/2016 - 04:34

టాలీవుడ్‌లో ఇప్పుడు ఏ నోట విన్నా రాశీఖన్నా పేరే..! అతి తక్కువ కాలంలో అందరి నోళ్లలో నానుతున్న ఈ పేరుకు భలే క్రేజ్ ఏర్పడింది. రాశీఖన్నా వరుస అవకాశాలతో మంచి ఊపుమీదుండడంతో ఇతర తారలకు..ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ భామలకు మింగుడు పడడంలేదట.

07/02/2016 - 21:01

బాలయ్య వందవ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ నటుడికైనా తన వందవ చిత్రం అంటే నిజంగా హాట్ టాపిక్కే మరి! అయితే ఇందులో బాలయ్యకు జోడీగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శ్రీయ ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించనుందట. శాతకర్ణి భార్యగా చక్కటి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనుందట.

07/02/2016 - 20:59

అవును..అందాల ‘చందమామ’ కాజల్ అగర్వాల్ మరో కొత్త అవతారం ఎత్తబోతోందట. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తో ‘మగధీర’లో చిందులేసిన ఈ ముద్దుగుమ్మ అటు తర్వాత అతడితోనే ‘గోవిందుడు అందరివాడేలే’ జతకట్టిన విషయం తెలిసిందే. మళ్లీ చరణ్‌తో నటించే అవకాశమే రాలేదు కాజల్‌కు. చాన్నాళ్లకు ఇప్పుడొచ్చింది ఆ ఛాన్స్! రామ్‌చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధ్రువ’లో అతడికి జోడీగా నటించనుందట. అయితే అదీ..హీరోయిన్‌గా కాదు సుమా!

07/02/2016 - 20:56

‘ఒక లైలాకోసం..’ అంటూ నాగచైతన్య అందాల తార పూజాహెగ్డేతో ఆడిపాడిన చిత్రం గుర్తుంది కదా. అవును..అప్పుడే ఎలా మరచిపోతాం. పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో తొలి చిత్రం అది. అటు తర్వాత తన రెండో చిత్రం ‘ముకుందా’లో గోపికమ్మ పాత్రలో తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ చిత్రంలో పూజాహెగ్డే నటనలో వైవిధ్యాన్ని చూసిన బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ముగ్ధుడయ్యాడట.

06/25/2016 - 22:15

నటి సమంత ప్రస్తుతం మంచి జోష్‌లో వుంది. చేస్తున్న చిత్రాలు..సాధిస్తున్న విజయాలు...ఆమెను కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఆనందంలోనే ఇప్పుడు తేలియాడుతోంది ఈ భామ. తమిళంలో తెరి, 24 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమేగాక, నటిగా సమంతకు మంచి ఊపునిచ్చాయి.

06/25/2016 - 22:12

ఒక సారి శింబు...మరోసారి ప్రభుదేవా..ఇలా అందాల భామ దక్షిణాది స్టార్ నయనతారకు ఎప్పుడూ వార్తల్లో వుండటమే అలవాటుగా మారినట్టుంది. అందుకే కాబోలు.. సినిమా విజయాలతో పాటు లవ్ ఎఫైర్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. గతంలో ప్రేమలో విఫలమైన ఈ సుందరాంగికి మరోసారి అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైందట. ప్రేమ ప్రేమ అంటూ గతంలో నయనపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.

Pages