S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

10/07/2017 - 20:53

సౌత్ ఇండియాలో పాపులర్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పేమాట నయనతార అని. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూనే మరోవైపు కుర్ర హీరోలతో ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే నయనతార వరుస సినిమాలతో బిజీగా వుంది. దాంతోపాటు దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈమె, టైమ్ దొరికినపుడల్లా ప్రియుడుతో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

10/07/2017 - 20:51

బాలీవుడ్ బ్యూటీ, హాట్ హాట్ బేబీ ఆలియా భట్ తాజాగా ఓ హ్యాండ్ సమ్ యువకుడితో చెట్టా పట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో కనువిందు చేశాయి. వైరల్‌గా మారిన ఈ ఫొటోల్లో ఉన్న ఆ యువకుడు ఎవరని ఆరా తీయగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతను ఎవరోకాదు ఆలియా భట్ మాజీ ప్రియుడు అలీ దదార్కర్. ఈ ఫొటోల్లో ఆలియా బెస్ట్ ఫ్రెండ్ అకాంక్ష రంజన్ కూడా వుంది.

09/23/2017 - 22:48

శ్రీయ.. శ్రీయ... గత కొనే్నళ్ల క్రితం టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతల్లోనే కాదు, అగ్ర హీరోల మనసుల్లోనూ మెలిగిన పేరు. అందుకు కారణం లేకపోలేదు. పరిశ్రమలోకి అడుగుపెడుతూనే తన గ్లామర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను చిత్తుచేసేసింది. యువతరం క్రేజీ నటులతో జోడీ కడుతూనే, అగ్ర హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఇది గతం.. మరి ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావడానికి తెగ తాపత్రయ పడుతోంది.

09/23/2017 - 22:46

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’తో సంచలనం రేపింది. ఆ చిత్రంలో టాలీవుడ్ సెక్సీ ఐటెం బాంబ్ సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ‘డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు, ఆ చిత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. తాజాగా మరోసారి ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమా చూపించబోతోంది విద్యాబాలన్. ఆ సినిమా పేరు ‘తుమ్హారీ సులు’.

09/23/2017 - 22:44

చేపలు పట్టేది నాకోసం కాదండోయ్.. మా అమ్మ కోసం అంటోంది అందాల తార అనుష్క. సహజంగా ఎవరికైనా వేటకు వెళ్లి చేపలు పట్టుకురావాలన్న కోరిక వుంటుంది. కానీ సినిమా తారలకు కోరికలేమీ లేకపోయినా అలా తీరిపోతూనే వుంటాయి. ఇదే విషయాన్ని నటి అనుష్క చెప్పుకొచ్చింది. తనకు ఎలాంటి కోరికలూ లేవట. ఏ కోరిక అయినా సరే అమ్మ కోరినట్లుగా తాను కనిపించడమే అంటోంది. మహారాణిలా కనిపించాలని అనుష్క తల్లి అనుకున్నదట.

09/23/2017 - 22:43

నేను నటించిన సినిమా గురించి మాట్లాడండయ్యా, ఆ పని చేయకుండా మా వ్యక్తిగత జీవితాలపై ఎందుకు దృష్టిపెడతారు అంటూ గత కొనే్నళ్లుగా అనేకమంది హీరోయిన్లు అడిగే పాత ప్రశే్న అడుగుతోంది పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్. మహేష్‌బాబుతో ‘వన్’, నాగచైతన్యతో ‘దోచేయ్’ చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ అమ్మడు.

09/16/2017 - 16:41

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కెరీర్ యమ జరుమీదుంది. చేసే సినిమాలు అయితేనేమి.. పోషించే పాత్రలు అయితేనేమి... వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటూ కెరీర్‌లో మంచి స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా నాగచైతన్యతో ‘యుద్ధం శరణం’ చిత్రం చేసింది. టాలీవుడ్‌లో అటు క్రేజీ హీరోలు, ఇటు యువతరం కథానాయకులతో జోడీ కడుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టిచుకుంటోంది.

09/16/2017 - 16:38

చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న సెక్సీ నటి రాయ్‌లక్ష్మీ. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘జూలీ-2’లో ఈ అమ్మడి గ్లామర్ హద్దులు మీరింది. ఈ భామ చిందించిన గ్లామర్ హద్దులు మీరిందని అందరూ అనుకుంటున్నారు. వారి మాటలను నటి రాయ్ సిల్లీగా కొట్టి పారేస్తోంది.

09/16/2017 - 16:35

నచ్చినోడు దొరికితే ఇట్టే పెళ్లికి రెడీ..అంటోందిట అందాల తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలతో జోడీకట్టి తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అక్కడా తనేంటో నిరూపించుకునే దిశలో అడుగులు కదుపుతోంది.

09/16/2017 - 16:32

హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ ఏడాది విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏంజెలీనా చేసిన చిత్రాలు.. ఆయా చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మరపురానివి. తన వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలతో కొంతకాలం ఆమె నటనకు దూరమైంది. గత సంవత్సరం బ్రాడ్‌పిట్ నుంచి విడాకులు తీసుకుంది.

Pages