S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/03/2016 - 07:39

ఎతె్తైన పర్వత శిఖరాల్లో ‘కారకోరం’ రెండవది. ఇందులో 60కి పైగా 7వేల మీటర్ల ఎతె్తైన శిఖరాలు ఉన్నాయి. 166 చ.కి.మీ. విస్తీర్ణంలో వుండే ఈ పర్వత శ్రేణిలో కె2 శిఖరం ఎవరెస్ట్ శిఖరం తర్వాత ఎతె్తైనది. ఇది రాతి గుమ్మటంలా ఉంటుంది. నునుపుదేలి ఉంటుంది. అందుకే అధిరోహణకు వీలుకాదు. పాకిస్తాన్, ఇండియా, చైనాలకు సరిహద్దుల్లో ఉంటుంది. పాకిస్తాన్ బాల్టిలోని స్కర్దూ నుండి మాత్రమే దీన్ని ఎక్కడానికి కొంత వీలుంటుంది.

04/03/2016 - 04:48

ఒక రాజుగారు తన రాజ్యంలో పరిస్థితులు స్వయంగా తెలుసుకోవాలని మారువేషంలో తిరుగుతూ ఒక తోటకు వెళ్లాడు. అక్కడ కమ్మని మామిడి పళ్లు చూస్తే ఆయనకు దాహం గుర్తుకొచ్చింది. దాని రైతును కలిసి దాహం అడిగాడు. రైతుకు ఆయన రాజుగారని తెలీదు. అయినా అతిథి మర్యాదలు చేసి, ఓ మామిడి పండుని పిండి పెద్ద గ్లాసుడు రసం తీసి ఇచ్చాడు. ఒక్క మామిడి పండుకు ఇంత మధుర రసమా...’ అని ఆశ్చర్యపోయాడు రాజు.

04/03/2016 - 01:28

పట్నంలో ఉంటున్న జయ, జయరాం దంపతులకు సిద్ధు ఒక్కడే కొడుకు. ఏడేళ్ల సిద్ధు ఎంతో బుద్ధిమంతుడు. వాడికి తాతయ్య, నానమ్మ అంటే ఎంతో ఇష్టం. వారి ముద్దు మురిపాలు అంటే మరీమరీ ఇష్టం. అందుకే పల్లెలో ఉంటున్న వారి దగ్గరికి తరచూ వెళ్లాలని ఉంటుంది. తాతయ్య చెప్పే కబుర్లు, నానమ్మ చెప్పే కథలు వింటూ ఈ లోకాన్ని మరిచిపోతుంటాడు. అందుకే నెలకొక మారైనా తండ్రి జయరాంను ఒప్పించి వారి దగ్గరకు వెళ్లి వస్తుంటాడు.

03/26/2016 - 23:30

ఖజకిస్థాన్‌కీ తూర్పు చైనాకీ ఆనుకొని వున్న అతి లోతైన పర్వత కనుమ చరిన్ కానియన్. ఈ లోయ అమెరికన్ గ్రాండ్ కానియన్‌ను తలపిస్తుంది. ఎన్నో రంగులు పేర్చిన గుహగా దర్శనమిస్తుంది. అడుగున భూకంపం వల్ల వచ్చి ఏర్పడిన రాతి గుట్టల పైభాగంలో ఎర్రని రాళ్లు , బూడిద రాళ్లు కలిపిన కొండ చరియలు ఉంటాయి. మనం దగ్గర నుండి చూస్తే ఈ ప్రాంతం ఒక ఎడారిలా, నదీ ప్రవాహం వల్ల ఇక్కడ ఒక ఒయాసిస్సు ఏర్పడినట్లు కన్పిస్తుంది.

03/26/2016 - 23:13

కార్ల తయారీ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఫోర్డ్ కేవలం స్వశక్తిపై విశ్వాసాన్ని పెంచుకుని అద్భుతమైన విజయాలు సాధించాడు. హెన్రీఫోర్డ్ 1863 జులై 30న అమెరికాలోని డియర్‌బోర్న్‌లో జన్మించాడు. ఫోర్డ్‌కి చిన్నతనం నుంచీ ‘వస్తువులు ఎలా పని చేస్తున్నాయి?’ అనే విషయంపైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. అతనిని ప్రోత్సహించే మిత్రుడు రాడిమన్ ‘నీకు వచ్చే ప్రతి ఆలోచనను పేపర్ మీద పెట్టు’ అంటూ ఉత్సాహపరిచాడు.

03/26/2016 - 23:11

నందవరం మహారాజు రాణిగారితో, వారి ఏకైక ముద్దుల కొడుకు వీరప్రతాప్ చంద్రునితోపాటు నల్లమల అడవులలో తపస్సు చేసుకొంటూ ఆశ్రమ జీవితం గడుపుతున్న స్వామి కృపానందం దగ్గరికి వచ్చారు. కృపానంద స్వామి వారికి తన శిష్యుల ద్వారా గొప్ప అతిథి మర్యాదలు జరిపించారు. వారు దైవాంశ సంభూతులు అని చెప్పగా విని మహారాజుగారు సకుటుంబ సపరివారంగా విచ్చేశారు.

03/26/2016 - 23:08

స్కూల్ నించి ఇంటికి వచ్చిన ఏక్తారా తన ఇమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి చూసుకుని చెప్పింది.
‘్ఛ! నా ఫ్రెండ్ భట్నాగర్‌కి మర్యాద తెలియదు’
‘ఏమైంది?’ తల్లి అడిగింది.
‘వాడి పెన్ రీఫిల్ అయిపోతే నా పెన్నుని ఇచ్చాను. లేదా స్లిప్ టెస్ట్ రాయలేక పోయేవాడు. థాంక్స్ లెటర్ పంపుతాడని చూస్తే నా ఇమెయిల్‌లో లేదు’

03/26/2016 - 22:57

చిన్నారెడ్డి (గుత్తి)
ప్రశ్న: మేము నివసిస్తున్న ఇంటికి దిక్కులు తిరిగి ఉంటాయి. అంటే తూర్పు దిశ అనుకున్నది ఆగ్నేయం అవుతున్నది. అలా ఉండవచ్చునా?

03/26/2016 - 21:18

వైద్యుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఒక వైద్య నిపుణుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. ‘వైద్యుడి సహాయం అవసరమైన చోట వెనువెంటనే హాజరై వైద్య సేవలు అందించాలి. ఆలస్యం చేస్తే ప్రకృతి ఆ రోగి రోగాన్ని తనే నయం చేసేస్తుంది’
ఈ నిపుణుడు తమాషాకి ఇలా సలహా ఇచ్చాడని వైద్యులు అనుకున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఈ సలహాలోని యధార్థం తెలుసు.

03/26/2016 - 21:05

మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఉత్తరాలు రాసుకోవడం తగ్గిపోయింది. మాట్లాడుకోవడం ఎక్కువై పోయింది. అవసరం వున్నా లేకున్నా సంక్షిప్త సమాచారాలు ఎస్‌ఎంఎస్ పంపుకునే పరిస్థితి వచ్చింది. సంక్షిప్త సమాచారాల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనవసరంగా రింగ్ చేసి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. కొత్తవాళ్లకి విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది.

Pages