S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/24/2018 - 22:11

రాముడు
సీతాసమేత కారుణ్యధాముడు
కార్యశూరుడు మానవ దేవుడు
పత్నీబద్ధుడు
ధర్మమనే విల్లును పట్టి
న్యాయాంబులను ఎక్కుపెట్టి
ధరలో నీతిని నిలిపిన
రామాయణ పురుషుడు
శబరి ప్రేమను ఆస్వాదించిన రేడు
అహల్యను శాపవిముక్తను చేసినవాడు
కైకేరుూ మానస పుత్రుడు
పదవీ త్యాగంలో పవిత్రుడు
తండ్రి మాట జవదాటడు
గుహుని నావలో అద్దరి చేరిన మారాజు

03/24/2018 - 20:44

ఒకప్పుడు పాలకుల నిరాదరణకు గురైన ఒంటిమిట్ట రామాయలం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహించేది. రాష్ట్ర విభజన ఫలితంగా భద్రాద్రి తెలంగాణ ప్రాంతానికి చెందడంతో, ఏపీ ప్రభుత్వం సీతారాముల కల్యాణాన్ని కడప జిల్లా ఒంటిమిట్టలో గత కొనే్నళ్లుగా నిర్వహిస్తోంది.

03/24/2018 - 20:17

పుత్రకామేష్టి పరమాన్నం!
ఉదయించిన పరబ్రహ్మం!!
కౌసల్యా దశరథ నందనం
శ్రీరామ జననం!!
విశ్వామిత్రుని యాగ రక్షణం
అహల్యా శాపవిమోచనం
శివధనస్సు భంగం
సీతారాముల పరిణయం
పితృవాక్య పరిపాలనం
కానన వాసారంభం
పాదుకా పట్ట్భాషేకం
పంచవటి నివాసం
సీతాపహరణం
జటాయు మరణం
హనుమత్సేవనం
సుగ్రీవ సంభాషణం
సీతానే్వషణం

03/24/2018 - 20:11

దేశంలోని రామాలయాల్లో విశిష్టత కలిగి రెండో అయోధ్యగా పేరుగాంచిన చారిత్రక ప్రాధాన్యత గల రామక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం. అద్భుతమైన శిల్పకళాకృతులు, ఆకాశాన్నంటినట్టుండే మూడు గోపురాలు, సువిశాలమైన మండపం, ఎతె్తైన ధ్వజస్తంభంతో అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఏకశిలానగరంగా పిలవబడే ఒంటిమిట్ట రామాలయం విజయనగర రాజుల కాలం నాటి కళావైభవానికి సాక్షీభూతంగా నిలుస్తోంది.

03/18/2018 - 00:09

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పా):
ఆదాయం-2, వ్యయం -14; రాజపూజ్యం- 5, అవమానం - 7

03/18/2018 - 00:06

చైత్రమాసపు ప్రభాతవేళ
ముంగిట్లో విరిసిన మల్లె
జాజి పరిమళాలతో
కొత్త ఆశలు చిగురింపచేసి
సరికొత్త ఊహలకు ఊపిరులూది
మంచుపూల దుప్పటి కప్పుకున్న
శిశిరాన్ని తరుముతూ...
ఆదివై.. యుగాదివై.. రావమ్మా
పూలతేరువై విచ్చేయు
వసంతుని ఆగమనంతో..
ప్రకృతికాంత నవశోభలు విలసిల్లగా
గున్నమామిడి కొమ్మపై
మత్తకోకిల సుస్వరం ఆలపించగా

03/18/2018 - 00:03

ఆ మధ్య ఓ కాలేజీ వార్షికోత్సవ సభకి పిలిచారు. వాళ్ల సర్ట్ఫికెట్స్, అవార్డుల ప్రదానానికే చాలా సమయం గడిచింది. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు. నాతో పాటు మరో ముగ్గురు మాట్లాడాలి. అందుకని నా ఉపన్యాసం చిన్నగా వుండాలి, వాళ్లని వాళ్ల లక్ష్యాల వైపు ప్రేరేపించినట్టుగా ఉండాలి. ఆ కాలేజీలో రకరకాల కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అందుకని నా ఉపన్యాసం ఇలా కొనసాగింది.

03/17/2018 - 23:34

ఉగాది అంటే ఏమిటి?
ఒక చెట్టు, ఒక పువ్వు...

03/17/2018 - 23:27

ఆగాగు..!
మామిడి పిందెలు
కోసుకొచ్చేటప్పుడు
కాసిన్ని మమతల్నీ తీసుకురా!
వేపపూల కోసం వెదుకుతూన్నప్పుడు
దారిలో జారిన చిరునవ్వులు
దాచుకుని తెచ్చుకో
తోటలో కోయిల పాట మొదలవగానే
మనసు లోపల నాలుగు మంచి మాటలు
వరుసలో పేర్చుకో
బెల్లం ముక్క తీపిలో కొంచెం
ప్రేమ కలుపుకో
చింతపండు పులుపులో
చింతలన్నీ దులుపుకో

03/17/2018 - 23:25

చిరదారిద్య్రము రూపుమాసినది సంక్షోమమ్ము నల్దిక్కులన్
స్థిరమై కేతనమెత్తె ఆకసపు వీధిన్ వంద రాకెట్లు శ్రీ
హరికోటన్ పురి విప్పుకొన్న యవి ఈ ఆనందవౌవేళ వ
త్సర రాజా ఘనవౌ విళంబి కొనుమా సౌరభ్య పుష్పాంజలుల్
*

Pages