S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/13/2018 - 12:47

మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగకపోతే మనల్ని మనం నిందించుకుంటాం. మనం వున్న పరిస్థితులని నిందిస్తాం. మనం వున్న పరిస్థితులని బట్టి మనని మనం నిర్వచించుకుంటాం. ఇది సరైనది కాదని అన్పిస్తుంది.
మన యోగ్యతని, తెలివితేటలని బయట వుండే పరిస్థితులకి అప్పచెప్పితే అది మనకు మనం తగ్గించుకుంటున్నట్టు అవుతుంది తప్ప మరోవిధంగా వుండదు.

05/12/2018 - 21:04

బరువును తగ్గించుకోవడానికి ఈతను మించింది లేదు. అలాగే గుండె వ్యాయామానికి ట్రెడ్‌మిల్. ట్రెడ్‌మిల్ అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఈతకొలనును పెట్టుకునే స్థోమత అందరికీ ఉండదు కదా! అలాంటివారికోసం వచ్చిందే ఆక్వా ట్రెడ్‌మిల్. సాధారణంగా కీళ్లనొప్పులు ఉన్నవారు ఈత, ట్రెడ్‌మిల్ వంటివి చేస్తే నొప్పులు వస్తాయని చాలామంది వాటిని చేయాలంటే జంకుతారు.

05/12/2018 - 20:25

పిల్లలకు సెలవులున్నప్పుడు స్కూలు గుర్తుకువస్తుంది. ఎందుకంటే స్కూలుతో, హోంవర్కులతో బిజీగా గడిపేయొచ్చు. స్కూలు ఉన్నప్పుడు సెలవులు కావాలనిపిస్తాయి. పసి మనస్తత్వం ఇలాగే ఉంటుంది. పిల్లలు వేసవి సెలవుల్లో ఆటలు ఆడుతూ కనిపిస్తారు. అయితే ఎండ వేడిమికి పిల్లలను బయటకు పంపకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి వీడియోగేమ్స్ ఆడిస్తుంటారు తల్లిదండ్రులు. అయితే వారు కాస్త ఎక్కువగా ఆడితే తల్లిదండ్రులే విసుక్కుంటూ ఉంటారు.

05/12/2018 - 20:08

‘స్థిరబద్ధితోనే యోగనిష్ఠ సాధ్యం అని అంటుంది కదా భగవద్గీత. మరి స్థిరబుద్ధికి కావలసింది చిత్తవృత్తి నిరోధమే కదా?!’ చైతన్యది ఏదో చెప్పాలనే తాపత్రయం.
చైతన్య ప్రశ్న పూర్తి కాకుండానే ‘చిత్తవృత్తి నిరోధం అంటే నువ్వేమనుకుంటున్నావ్?’ నా పరిప్రశ్న.

05/12/2018 - 19:13

అర్ధరాతి మంచి నిద్రలో ఉన్నప్పుడు కొంతమంది పెద్దవారికీ, మధుమేహం ఉన్నవారికీ బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు నిద్ర లేచి స్విచ్‌బోర్డ్ దగ్గరికి వెళ్లి లైట్ ఆన్ చేసుకుని బాత్‌రూమ్‌కి వెళ్ళాలి. అంతేకాకుండా ఆ రూములో పడుకున్న మిగిలిన వారికి నిద్రా భంగం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వచ్చిన విద్యుత్ కాంతులే ‘మై లైట్‌డాట్ మి’. ఇవి సెన్సర్ల ద్వారా పనిచేస్తాయి.

05/12/2018 - 19:10

‘ఛ.. ఛీ.. ఏంటి సోఫాపైన చేపను పెట్టారు? ఈ కోడి ఎక్కడి నుండి దాపురించింది.. మంచంపైకి చేరింది? ఈ దరిద్రపు బల్లులు టీపాయ్ మీద ఏం చేస్తున్నాయ్? అయినా ఇంత పెద్ద బల్లులున్నాయేమిటి మీ ఇంట్లో?’ ఇలా... చాలా చాలా కామెంట్లే వస్తాయి ఇలాంటి దిండ్లను చూస్తే.. ఇంటికి వచ్చిన వారెవరైనా సరే ఒక నిముషం పాటు ఆగిపోవాల్సిందే వీటిని చూసినప్పుడు. కోడి, చేప.. ఏంటి?
యాంగ్రీ బర్డ్స్, పోకేమన్ వంటి కార్టూన్

05/06/2018 - 06:33

మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో గుంతలు కన్పిస్తాయి. అదే విధంగా మరెన్నో స్పీడ్‌బ్రేకర్లు వుంటాయి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మన వాహనాన్ని మెల్లగా నడుపుతాం. కాస్త జాగ్రత్తగా ఉంటాం.
అంతేకానీ రోడ్డు బాగోలేదని మన ప్రయాణాన్ని వాయిదా వేసుకోం. మానెయ్యం. మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఈ సూక్ష్మమైన విషయాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడంలో పొరపడతాం. సరిగ్గా అన్వయించుకోం.

05/05/2018 - 21:52

వేసవికాలంలో పడుకునేటప్పుడు ఏసీ వేసుకుంటాం. గదంతా చల్లబడడానికి సమయం పడుతుంది. ఆ ఏసీ పవనాలు ఆస్వాదించడానికి చాలా కరెంటు ఖర్చు అవుతుంది. అలా కాకుండా కేవలం మనం పడుకున్న మంచం మాత్రమే చల్లబడితే కరెంటుఖర్చు తగ్గుతుంది కదా.. అని ఆలోచించారేమో పరిశోధకులు ఈ మంచం ఏసీని కనిపెట్టేశారు.

05/04/2018 - 14:35

కూలర్ అంటే కొత్తపరికరమా? పైపెచ్చు అంత పెద్దదాన్ని.. ఆగండాగండి.. చెప్పేలోపే మీరలా అనేస్తే ఎలా? ఇది చాలా చిన్న కూలర్. పైగా దీనివల్ల కరెంటు ఖర్చు కూడా తగ్గుతుంది. వేసవికాలంలో ఇంట్లో ఏసీ లేదా కూలర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నెల గడిచేసరికి కరెంటుబిల్లు తడిసిమోపెడవుతుంది. దానికి పరిష్కారంగా వచ్చిందే ఈ మినీ ఎయిర్ కూలర్.

05/04/2018 - 13:54

గర్భిణి తొమ్మిది నెలలలో ధనుర్వాతం రాకుండా రెండు, మూడు డోసులు టెటనస్ వాక్సీన్ తీసుకోవాలని అందరికీ తెలిసిన విషయమే.. ఒక డోసుకి, రెండో డోసుకి మధ్య నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి ఉండాలి. ఆఖరి ఇంజక్షన్ (టి.టి.)ప్రసవానికి ఎంత దగ్గరగా తీసుకుంటే అంత మంచిది. జబ్బకిగానీ, తుంటికిగానీ తీసుకోవాలి ఈ ఇంజక్షన్.

Pages