S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/02/2017 - 20:52

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూపొందించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మూవీ ఆల్బమ్‌లో ‘చల్ చలో చలో/ లైఫ్ సే మిలో’ పాట ఎంతో స్ఫూర్తివంతం. ధనవంతుడైన హీరో హఠాత్తుగా తండ్రిని, ఆస్తిని పోగొట్టుకుని మధ్యతరగతి జీవితం గడపాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ ఈ పాటని స్వరపరిచిన తీరు నిజంగా అద్భుతం.

01/02/2017 - 20:49

కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన -శుభసంకల్పం గుర్తుండిపోయే చిత్రం. అప్పటివరకూ దర్శకుడిగా తెరవెనుకేవున్న విశ్వనాథ్ -మొట్టమొదటగా పూర్తినిడివి పాత్ర చేసిన చిత్రం కూడా ఇదే. దర్శకుడు మంచి నటుడైతే ఆ పాత్రకు ఎంత న్యాయం జరుగుతుందో -విశ్వనాథ్ చేసి చూపించారు. ఇక కమల్‌హాసన్, ఆమని, అతిథి పాత్రగానే కనిపించినా ప్రియారామన్ నటన కలగలిపి -విశ్వనాథ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది శుభసంకల్పం.

01/02/2017 - 20:45

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
* ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
* రచనల్లో కొత్తదనం ముఖ్యం
* అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

12/26/2016 - 21:35

కథ, నిర్వహణ: బిఎస్ రాయుడు
నృత్యం: చిన్ని, సంపత్
మాటలు: వేటూరి
కూర్పు: జగదీష్
కళ: వి రంగారావు
కెమెరా: వరదరాజన్, శ్రీకాంత్
సంగీతం: నిత్యానంద్
సమర్పణ: ఎస్‌సి నాగిరెడ్డి
దర్శకత్వం: విజయానంద్
**

12/26/2016 - 20:54

సిపాయి కూతురు (సత్యనారాయణ తొలి చిత్రం) చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు యల్ విజయలక్ష్మి. రెండో చిత్రంగా భక్తశబరి (శోభన్‌బాబు తొలి చిత్రం)లో సూర్పణక పాత్ర ద్వారా పరిశ్రమ గుర్తింపు పొంది, తర్వాత తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని, తమిళంలో శివాజీగణేషన్, ఎంజిఆర్, మలయాళంలో ప్రేమనజీర్‌లాంటి అగ్ర హీరోల సరసన పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

12/26/2016 - 20:50

-పరుశురామ్
యువత, ఆంజనేయులు, సోలో, సారొచ్చారు చిత్రాలతోపాటుగా ఇటీవల విడుదలైన శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పరుశురామ్. మనోనేత్రంతో ముందుగా సినిమాను చూడాల్సింది దర్శకుడేనని చెబుతున్న పరురశుతో ఈ వారం చిట్ చాట్..
**
మీ నేపథ్యం?

12/26/2016 - 20:46

పౌరాణిక చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘పాండవ వనవాసం’. భవిష్యత్ తరాలకు మన తెలుగువారి సామర్థ్యాన్ని తెలియచేయటానికి- మన పురాణాలు ఇతిహాసాలు ఎంత గొప్పవో తేటతెల్లం చేయటానికి ఉపకరించే కరదీపిక ఈ చిత్రం. ‘పాండవ వనవాసం’ చిత్రాన్ని చూస్తే దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రజ్ఞ, రచయిత సముద్రాల పాండిత్యం దర్శనమిస్తూంది.

12/26/2016 - 20:44

మా పాపాలు తొలగించి దీపాలు నీవే.... వెలిగించి నావయ్యా... మమ్ము కరుణించి నావయ్యా... జన్మజన్మలా పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించి నామయ్యా... మేము తరించి నామయ్యా...’ ఈ పాట శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం లోనిది. రచన గోగిన ప్రసాద్, సంగీతం ఇళయరాజా, షిర్డీసాయి మహాత్మ్యాన్ని తెల్పిన రచయిత సందేశం, దేవుడు కాదన్న వారికి అతని మహాత్మ్యం కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపబడింది.

12/26/2016 - 20:42

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

12/19/2016 - 22:59

బయోపిక్‌ల పేరు చెబితే బాలీవుడ్ చెవులు కోసుకుంటోంది. క్రీడాకారులు, రాజకీయ నేతల జీవితాలను తెరకెక్కించేందుకు దర్శకులు ఎక్కడలేని ఉత్సాహం చూపింస్తుంటే, ఆడియన్స్ సైతం వాటిని బాగానే ఆదరిస్తున్నారు. ధోనీ, బాగ్ మిల్కాసింగ్, మేరీకోమ్ వంటి చిత్రాలు ఇప్పటికే హిట్లు అందుకుంటే -తాజాగా అమీర్‌ఖాన్ చేస్తున్న దంగల్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Pages