S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/12/2016 - 21:59

టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో కెరీర్ సాగిస్తున్న తమ్మూ -కోలీవుడ్‌లోనూ తన ప్రతాపాన్ని చూపుతోంది. ధర్మాదురై, దేవి చిత్రాలతో హిట్లు అందుకున్న తమ్మూ బేబే -సంక్రాంతికి విశాల్‌తోనూ స్క్రీన్స్‌కు వస్తోంది. పెద్ద పండుగకు రాబోతున్న ‘కత్తి సండై’పై అంచనాలు పెరుగుతుండటంతో -మిల్కీ బ్యూటీ కెరీర్ మరింత ఊపందుకోవచ్చని అంటున్నారు.

12/12/2016 - 21:57

కళ: వాలి
నృత్యం: రాజు-జయరాం
ఎడిటింగ్: మార్తాండ్
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం: ఎల్లప్ప
అసోసియేట్ దర్శకులు: కెఎస్ ప్రకాశరావు
నిర్మాత, దర్శకులు: బిఎ సుబ్బారావు.
**

12/12/2016 - 21:24

అందగత్తె అనుష్క -చాలాకాలంగా గ్లామర్ షోకి దూరంగా ఉంది. కారణం ఆమె చేస్తున్న ప్రాజెక్టులు. ముందు బాహుబలి.. తరువాత రుద్రమదేవి.. ఆపైన సైజ్ జీరో. మూడు ప్రాజెక్టుల్లోనూ గ్లామర్ షోకి చాన్స్‌లేని పాత్రలే కావడంతో -అభిమానులను నిరాశ పరుస్తూనే వచ్చింది. చాలాకాలం తరువాత ‘క్యూట్ గాళ్’గా రెచ్చిపోయే చాన్స్ రావడంతో -సింగం 3లో అనుష్క గ్లామర్ ఓ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

12/12/2016 - 21:18

తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థల్లో క్రమశిక్షణ కలిగిన సంస్థగా ‘విశ్వశాంతి’కి పేరుంది. సంస్థ అధినేత కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చెందిన ఉప్పలపాటి విశే్వశ్వరరావు. నిమ్మకూరు అనగానే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు మనకు. ఈయనా -ఎన్టీఆర్‌కు స్వయాన మేనబావమరిది. బిఎస్పీ పట్టా పుచ్చుకున్న తరువాత -ఎన్టీఆర్ సూచనపై దర్శకుడు పి పుల్లయ్య వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా చేరాడు విశే్వశ్వర రావు.

12/12/2016 - 21:14

పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడు జన్మించక తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్తి శోఖింపతగదు అని ఘంటసాల వారు చెప్పినా.. పోయినోళ్లు అందరూ మంచోళ్లు/ ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు అంటూ ఆత్రేయవారు సినీ విరచితాన్ని వినిపించినా.. దూరమైన వాళ్లతో ఉండే బంధాన్నో, అనుబంధాన్నో, అభిమానాన్నో గుర్తు చేసుకోకుండా ఉండలేం.

12/12/2016 - 21:03

క్రిష్ ప్రయత్నాలే కనుక ఫలిస్తే -వెంకీతో నయన్ జోడీకట్టినట్టే. హిట్ పెయిర్‌ను మరోసారి స్క్రీన్‌మీదకు తెచ్చేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. లక్ష్మీ చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ, నయన్.. ఈమధ్యే ‘బాబు బంగారం’తో మరోసారి మురిపించారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని దిగ్విజయంగా పూర్తి చేసేసిన క్రిష్, తరువాతి ప్రాజెక్టు వెంకీతో చేయబోతున్నాడు.

12/12/2016 - 21:00

జననీ శివకామినీ/ జయశుభకారిణి/ విజయ రూపిణీ.. అంటూ నర్తనశాల చిత్రంలో ద్రౌపది (సావిత్రి) ఆలపించే పాట చాలా ఇష్టం. మహానటుడు ఎన్టీఆర్, యస్వీఆర్, సావిత్రి మొదలగు భారీ తారాగణం నటించి మెప్పించిన నర్తనశాలలో అన్నీ పాటలూ గొప్పవే అయినా -జననీ శివకామిని పాటకు ప్రత్యేకత ఉందనిపిస్తుంది.

12/12/2016 - 20:58

దశాబ్దం క్రితం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వెంకటేష్, అశిన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఘర్షణ’ సినిమా నాకు చాలా ఇష్టం. ఘర్షణ-2 ప్లాన్ చేస్తున్నట్టు ఆమధ్య పుకార్లు షికార్లు చేసినపుడు -అలాంటి సినిమా మళ్లీ వస్తే ఎంత బావుండు అనిపించింది. సమాజానికి చీడపురుగుల్లాంటి విలన్ల మీద ఆవేశం ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తీర్చుకునే రివేంజ్ -అసలు స్టోరీ. ఈ చిత్రం చానల్స్‌లో ఎప్పుడొచ్చినా ఇక మార్చే ప్రసక్తే ఉండదు.

12/12/2016 - 20:54

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

12/05/2016 - 22:15

సన్నజాజి తీగలా.. ఎర్రగులాబీ నవ్వులా.. తళుక్కున మురిపించే మెరుపు వనె్న -ప్రగ్యా జైస్వాల్. అయితే, ఆమెను అక్కడికే పరిమితం చేయొద్దంటున్నాడు కృష్ణవంశీ. ‘నక్షత్రాన్ని’ నేలకుదింపి ఓ రేంజ్‌లో ఉతికారేసే ఫైట్లు చేయిస్తున్నాడట ఆమెతో. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. బక్కపల్చని దేహంతో ప్రగ్య ఫైట్లు చేయడమేంటి? అని అనుకోవద్దని కూడా అంటోందట.

Pages