S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/18/2016 - 00:45

అనంతపురం, జూన్ 17 : పెనుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని కళ్యాణదుర్గం ఎక్సైజ్ సర్కిల్‌లో పని చేస్తున్న మహిళా సిఐని జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి మార్చడం వివాదాస్పదమైంది. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు రాజకీయ పలుకుబడి ఉపయోగించి కమిషనర్ ద్వారా ఆమెను తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

06/18/2016 - 00:43

అనంతపురం కల్చరల్, జూన్ 17: రాష్ట్రంలో కరవును పారద్రోలి సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సునీత అన్నారు. అందుకే కరవు జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. శుక్రవారం నగరంలోని రాంనగర్‌లో మొక్కలు నాటిన మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.

06/18/2016 - 00:43

అనంతపురం సిటీ, జూన్ 17: జిల్లాను కరువు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. అందులో భాగంగానే హరితానంత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో 1.13 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో హరితానంతగా జిల్లాను మారుస్తామన్నారు.

06/18/2016 - 00:42

గుంతకల్లు, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైల్వే ప్రైవేటీకరణ విధానాల వల్ల దేశభద్రతకు పెను ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యదర్శి సిహెచ్ శంకర్రావు అన్నారు. శుక్రవారం స్థానిక డిఆర్‌ఎం కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల ఎన్‌డిఏ పాలనలో కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కూలీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు.

06/18/2016 - 00:41

హిందూపురం, జూన్ 17 : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి సూచించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాల వార్షికోత్సవం పాఠశాల అధ్యక్షులు పిఎస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

06/18/2016 - 00:41

హిందూపురం టౌన్, జూన్ 17 : ప్రభుత్వం ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే బదిలీలకు అనుమతించడంతో ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. ఎక్కడికి బదిలీ అవుతామో అని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మున్సిపాలిటీల బదిలీల కౌనె్సలింగ్ శుక్రవారం ప్రారంభం కావడం, ఉద్యోగుల నుండి ఆఫ్షన్‌లు తీసుకుంటుండటంతో ఆందోళన తారాస్థాయికి చేరింది. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు మున్సిపల్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

06/18/2016 - 00:40

ఉరవకొండ, జూన్ 17 : మండలంలోని రాకెట్ల గ్రామంలో గురువారం రాత్రి విద్యుదాఘాతానికి యువకుడు మృతి చెందాడు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల మేరకు రాకెట్ల గ్రామానికి చెందిన మనోహర్ (25) గురువారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో శివార్లల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి ఫీజు వేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే చెందినట్లు తెలిపారు.

06/18/2016 - 00:39

పెనుకొండ, జూన్ 17 : మండల పరిధిలోని మంగాపురం చెందిన శిల్ప (20) శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్వగ్రామం చెనే్నకొత్తపల్లి మండలం పుల్లన్నగారిపల్లి కాగా పది నెలల క్రితం మంగాపురంలోని నాగిరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శుక్రవారం ఆమె భర్తతో గొడవపడి మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది. హిందూపురం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/18/2016 - 00:39

కదిరి టౌన్, జూన్ 17: కదిరి మండలం దినె్నమీదపల్లికి చెందిన గౌరమ్మ(19) శుక్రవారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బాబాకాలనీకి చెందిన గౌరమ్మను దినె్నమీదపల్లికి చెందిన రామాంజినేయులుకు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు.

06/18/2016 - 00:38

హిందూపురం టౌన్, జూన్ 17 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో హిందూపురం రూరల్ మండలం బీరేపల్లికి చెందిన ముద్దాయి వడ్డె శివకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక మెజిస్ట్రేట్ ఆనందతీర్థ తీర్పు చెప్పినట్లు వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషా తెలిపారు.

Pages