S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/16/2017 - 00:58

విజయవాడ, డిసెంబరు 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సాహిత్యం ముద్రణ విషయంలో చేయూతను అందించేందుకు సంకల్పించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, సృజనాత్మక, సంస్కృతి సమితి (రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ) విజయవాడ సంచాలకులు విజయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ ఉప ప్రణాళిక పథకం కింద గిరిజన సాసిత్యం ముద్రణకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

12/16/2017 - 00:57

విజయవాడ, డిసెంబర్ 15: రేషన్ షాపులు నిర్వహిస్తున్న ఇళ్లకు వాణిజ్య పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వెలగపూడిలో శుక్రవారం సీఎంను వారు కలిసి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ బకాయిలు చెల్లించాలని కోరారు.

12/16/2017 - 00:56

విజయవాడ, డిసెంబర్ 15: శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నం జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని 20 శాతానికి పెంచి, 2018 జనవరి నుండి అమలుచేసేలా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

12/16/2017 - 00:55

విజయవాడ, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17 నుంచి 22 వరకు మాల్దీవుల్లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా చేయనున్న ఈ పర్యటన ఆయన వ్యక్తిగత పర్యటనగా అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శుక్రవారం జీవో కూడా జారీ అయింది.

12/16/2017 - 00:55

విజయవాడ, డిసెంబర్ 15: ఆధార్ ఆధారిత విత్తన పంపిణీ విధానానికిగాను రాష్ట్ర వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో సీఎస్‌ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ ఎక్స్‌లెన్సీ అవార్డు-2017 లభించింది. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) సంస్థ ఈనెల 8న హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు కింద ఈ అవార్డు దక్కింది.

12/16/2017 - 00:54

విజయవాడ, డిసెంబర్ 15: ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగ, కార్మికులందరికీ జనవరి 10తేదీన సంక్రాంతి పండుగ అడ్వాన్స్ చెల్లింపుకు సంస్థ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల వల్ల 40వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నదన్నారు.

12/15/2017 - 04:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చైర్మన్ వెంకయ్య నాయుడు అనర్హత వేటు వేసినట్లుగానే లోక్‌సభలో కూడ పార్టీ మారిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం వైఎస్సాఆర్‌సిపి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయి రెడ్డి ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని తెలిపారు.

12/15/2017 - 04:50

అమరావతి, డిసెంబర్ 14: ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే లక్ష్యంగా ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ ప్రవేశ పెట్టామని, అధికారులు మరింత జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విధులను సమర్థంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నామని, ప్రజల సంతృప్తే పరమావధిగా పనిచేయాలని సూచించారు.

12/15/2017 - 04:47

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: విభజన చట్టం హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఈనెల 19వ తేదీలోగా అఫిడవిట్ దాఖలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు.

12/15/2017 - 04:44

రాప్తాడు, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధపు హామీలను రాష్ట్ర ప్రజలను మోసపుచ్చుతున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర 35వ రోజు గురువారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కందుకూరులో జగన్ మాట్లాడుతూ వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి సామాజికవర్గం కడుపుకొట్టారని అన్నారు.

Pages