S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/13/2017 - 23:11

అమరావతి, డిసెంబర్ 13: రెండేళ్లనుంచి పరిశీలన, పరిశోధన, సమీక్ష, పర్యటనలకే పరిమితమైన అమరావతి నగర నిర్మాణ ఆకృతులకు మోక్షం లభించనుంది. కీలకమైన అసెంబ్లీ భవన నిర్మాణ ఆకృతి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ, పరిపాలనా భవనాలకు సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ బృందం ప్రభుత్వం ముందుంచింది.

12/13/2017 - 04:18

విజయవాడ, డిసెంబర్ 12: కీలక ప్రాజెక్టుల అమల్లో అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో విభాగాధిపతులతో మంగళవారం జరిగిన సమావేశంలో విజయవాడ సమీపంలోని జక్కంపూడిలో ఏర్పాటు చేయనున్న ఎకనామిక్ సిటీ నిర్మాణం గురించి ఆరా తీశారు. దీని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.

12/13/2017 - 04:16

విజయవాడ, డిసెంబర్ 12: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భవానీ దీక్షాదారులు దీక్షలు విరమించి మొక్కులు చెల్లించుకోవడానికి దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించటంలో అశ్రద్ధ చూపించవద్దని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక పద్మావతి ఘాట్, దుర్గా ఘాట్లలో వసతులను పరిశీలించారు.

12/13/2017 - 04:15

విజయవాడ (పటమట) డిసెంబర్ 12: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం చంద్రబాబుకు, కేంద్ర మంతి నితిన్ గడ్కరికి పర్సంటేజీల పంపకంలో తేడాలు రావటం వల్లే పోలవరం పంచాయితీ నడుస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.

12/13/2017 - 04:15

విజయవాడ, డిసెంబర్ 12: చంద్రబాబు పాలనలో బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వైకాపా బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యుల మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారన్నారు.

12/13/2017 - 03:39

విజయవాడ, డిసెంబర్ 12: గ్రామాల సమగ్రాభివృద్ధి, స్వయం సమృద్ధే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్ కార్డులు కొత్తగా ఎంతమందికి అందివ్వాలన్నది త్వరలోనే నిర్ణయించి తెలియజేస్తామని చెప్పారు.

12/13/2017 - 03:34

నరసన్నపేట, డిసెంబర్ 12: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సిండికేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న చుక్కల భరత్‌కుమార్ (26) మంగళవారం ఉదయం తన నివాస గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన చదువు పూర్తి అయిన తర్వాత మొదటిసారిగా సిండికేట్ బ్యాంక్ మేనేజర్‌గా నరసన్నపేటలో బాధ్యతలు చేపట్టాడు.

12/13/2017 - 03:34

కర్నూలు, డిసెంబర్ 12: కర్నూలు జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నిక తేదీ ఖరారు కావడంతో పార్టీల్లో సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. గత మార్చిలో జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

12/13/2017 - 03:31

కాకినాడ, డిసెంబర్ 12: కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అది ఆమోదంపొందేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.

12/13/2017 - 02:33

తిరుపతి/ బి కొత్తకోట, డిసెంబర్ 12: తిరుపతి బైరాగిపట్టెడలోని నారాయణ మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఎం.హర్షవర్థన్ (17) మంగళవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడని, గత కొంతకాలంగా హర్షవర్ధన్ మానసిక ఒత్తిడితో ఉన్నట్లు తోటి విద్యార్థులు అంటున్నారని కళాశాల యాజమాన్యం చెబుతోంది.

Pages