S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/02/2016 - 05:01

విజయవాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో విజయవాడకు సుమారు 12 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారికి కావల్సిన వౌలిక సదుపాయాల ఏర్పాటు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

04/02/2016 - 04:55

హైదరాబాద్, ఏప్రిల్ 1: అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించి ఆ సొమ్మును వినియోగదారులు, ఏజెంట్లకు వడ్డీతో సహా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారత అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కె రంగారెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపింది. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది.

04/02/2016 - 04:48

హైదరాబాద్, ఏప్రిల్ 1: గ్రామీణ వైద్యు ల విధి విధానాల రూపకల్పనకు రాష్ట్రప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించిందని ఎపి వైద్య, ఆరోగ్యమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు.

04/02/2016 - 04:47

గుంటూరు, ఏప్రిల్ 1: రాజధాని అమరావతిలోనిర్మాణమవుతున్న సచివాలయం గడువుకన్నా ముందే పూర్తవుతుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం లో పని చేయడం కోసం హైదరామాద్‌నుంచి 12 వేల మంది తరలిరానున్నారని చెప్పారు. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడిని అధిగమించేందుకు నిధుల కొరత లేదని నారాయణ అన్నారు.

04/02/2016 - 04:46

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పోలీసు శాఖను పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌పై విఐపిలు, వివిఐపిల భద్రత ఏర్పాట్ల భారం రోజు రోజుకీ పెరగడంతో పాటు నిఘాపరంగా పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించింది.

04/02/2016 - 04:44

గుంటూరు, ఏప్రిల్ 1: గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్ (ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్) పనులు ప్రారంభమయ్యాయి. కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1618 కోట్లును ప్రకటించిన విషయం విదితమే. సుమారు 196 ఎకరాల స్థలంలో ఎయిమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకోనుంది. అందులో భాగంగా తొలుత 196 ఎకరాలకు ప్రహరి గోడ నిర్మించనున్నారు.

04/02/2016 - 04:42

తిరుమల, ఏప్రిల్ 1: టిటిడి నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు దుబాయ్‌కి చెందిన శైలేష్‌కుమార్ దాస్ రూ.కోటి 30లక్షలు శుక్రవారం విరాళంగా అందించారు. డోనార్స్ వింగ్ డిప్యూటీ ఇ ఒ రాజేంద్రకు ఇందుకు సంబంధించిన చెక్కును అందించారు.

చిత్రం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.కోటి 30లక్షలు విరాళంగా అందిస్తున్న దుబాయ్‌కి చెందిన భక్తుడు

04/02/2016 - 04:41

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కొత్తగా రెండు ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఏకీకృత చెక్‌పోస్టుకు రూ. 94.50 కోట్లు ఖర్చవుతుంది. నెల్లూరు జిల్లా తడ వద్ద బివి పాలెం, శ్రీకాకుళం జిల్లా కరపాడు గ్రామం వద్ద పురుషోత్తమపురంలో ఏకీకృత చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తారు.

04/02/2016 - 03:14

తిరుపతి, ఏప్రిల్ 1: టిటిడి పరిధిలోని విశాఖ జిల్లా ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల సత్రంలో అసాంఘిక కార్యక్రమాలను పాల్పడ్డ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉపమాక ఆలయం వద్ద ఒక మహిళతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడిన విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమైన నేపధ్యంలో ఇఒ తీవ్రంగా స్పందించారు.

04/02/2016 - 03:13

కొవ్వూరు, ఏప్రిల్ 1: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాల్టీలో 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52) (టిడిపి) శుక్రవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఒక వివాహ విందుకు హాజరై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతిచెందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

Pages