S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/23/2016 - 13:38

విశాఖ: విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)కు వచ్చే బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. విమ్స్‌ను అధునాతన ఆస్పత్రిగా తీర్చిదిద్ది పేదలకు అందుబాటులో ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. బిజెపి అనుసరిస్తున్న మతతత్వ విధానాల వల్లే దేశంలో అశాంతి చోటుచేసుకుంటోందని వారు ఆరోపించారు.

02/23/2016 - 13:40

విశాఖ: రాష్ట్ర విభజన జరిగినపుడు ఎనిమిది నెలల్లోగా విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ ఇంతవరకూ నెరవేరలేదని, ఇకనైనా ఆ హామీని నిలబెట్టుకోవాలని ఎపి విద్యార్థి ఐకాస, నిరుద్యోగ సమితి నేతలు డిమాండ్ చేశారు. విశాఖలో రైల్వేజోన్‌ను వెంటనే ఏర్పాటు చేసేలా కేంద్రంలో కదలిక రావాలని ఆకాంక్షిస్తూ వారు మంగళవారం ఇక్కడి సంపత్ వినాయక ఆలయంలో పూజలు చేశారు.

02/23/2016 - 12:01

గుంటూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉన్మాదిగా మారిన ఓ భర్త భార్యను దారుణంగా కొట్టి చంపిన ఉదంతం తెనాలి మండలం కాజీపేటలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

02/23/2016 - 12:00

విజయనగరం: తన ఊపిరి ఉన్నంతవరకు వై.ఎస్. జగన్‌కు అండగా ఉంటానని బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు అన్నారు. తాము టిడిపిలో చేరబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు రాసే పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో చెప్పారు.

02/23/2016 - 12:00

విజయవాడ: భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా తక్షణం పాకిస్తాన్ వెళ్లిపోవాలని బిజెపి నాయకుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏ ఎన్నికల్లోనూ గెలవలేక పోతున్న కమ్యూనిస్టులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

02/23/2016 - 11:59

విజయవాడ: రాష్ట్భ్రావృద్ధిని ఏ మాత్రం కోరుకోని వైకాపా అధినేత జగన్ ప్రాంతాలు, కులాల పేరిట చిచ్చు పెడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏ క్షణంలోనైనా కూల్చేస్తానని వ్యాఖ్యలు చేసిన జగన్‌ను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారని అన్నారు. వైకాపాలో చివరకు జగన్ తప్ప ఎవ్వరూ ఉండరని అన్నారు.

02/23/2016 - 11:59

కడప: కడపలో ప్రసిద్ధి చెందిన పెద దర్గాను సినీ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం దర్శించి ప్రార్ధనలు చేశారు. రెహమాన్‌ను చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

02/23/2016 - 11:58

విశాఖ: పరవాడ వద్ద జయరాం కాలనీలో కొందరు దుండగులు 60 ఏళ్ల మహిళను గొంతు కోసి చంపారు. ఆమె వొంటి మీద బంగారం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెబుతున్నారు.

02/23/2016 - 11:58

విశాఖ: కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గబెట్టేందుకు నిషేధిత రసాయనాలను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో నగరంలోని పూర్ణ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం ఆహార నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పండ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షకు పంపారు.

02/23/2016 - 11:58

విశాఖ: విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో మంగళవారం ఉదయం నాటుపడవ బోల్తా పడగా ఓ మహిళ గల్లంతయింది. మంగపాడు సమీపంలో పడవ బోల్తాపడగా ముగ్గురు వ్యక్తులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా ఒడిశా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Pages