S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/30/2016 - 18:22

హైదరాబాద్: ఎపి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి తగినన్ని నిధులు కేటాయించలేదని అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి గానీ, ఆర్‌బిఐ నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండానే పబ్లిక్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా వాడుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమదే నైతిక విజయం అని ఆయన చెప్పారు.

03/30/2016 - 17:49

విజయవాడ: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారికి చెందిన బ్యాంకు లాకర్‌ను ఎసిబి అధికారులు బుధవారం తెరిచి భారీగా నగలు కనుగొన్నారు. 19 లక్షల రూపాయల బంగారు నగలు, మూడు కిలోల వెండినగలు లాకర్‌లో లభించాయి.

03/30/2016 - 16:59

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన అనంతరం బుధవారం మధ్యాహ్నం ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

03/30/2016 - 16:58

అనంతపురం: ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి మాత్రం వద్దంటున్న ప్రియుడి తీరుకు విసిగివేసారి ఓ యువతి అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. నగరంలోని వినాయకనగర్‌కు చెందిన నవీన్, శాంతి 2009లో ఎంబిఎ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి నవీన్ నిరాకరించడంతో మహిళా సంఘాల మద్దతుతో బుధవారం అతని ఇంటి వద్ద శాంతి నిరసన ప్రారంభించింది.

03/30/2016 - 16:56

విశాఖ: 2,200 కోట్ల రూపాయలతో విశాఖ పోర్టును ఆధునీకరిస్తున్నట్లు పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు బుధవారం తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్ టన్నుల నుంచి 125 మిలియన్ టన్నులకు పెరిగేలా ఆధునీకరణ పనులు జరుగుతాయన్నారు. పోర్టులో పది కోట్లతో ఏసీ టెర్మినల్, భీమిలి వద్ద 300 కోట్లతో క్రూయిజ్ టెర్నినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

03/30/2016 - 16:55

హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రభుత్వ పాలనలో అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నామని, ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో అవకతవకలను అరికట్టామని ఎపి సిఎం చంద్రబాబు బుధవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేలా కృషిచేస్తున్నామని, ఈ ఏడాది 10.9 వృద్ధిరేటును సాధించామన్నారు.

03/30/2016 - 16:55

హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం ఎపి శాసనసభ ఆమోదించింది. ఈ పెంపును వైకాపా సభ్యులు వ్యతిరేకించడంతో సభలో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపు విషయమై ఏదోఒక నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం కోరితే ఏ ఒక్కరూ దీన్ని సమర్థించరని వైకాపా సభ్యుడు కోటంరెడ్డి అన్నారు.

03/30/2016 - 16:54

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో ఇటీవల ఎక్కువగా ‘రాయలసీమ గూండాలు’ అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ఎపి అసెంబ్లీ సమావేశంలో ఆవేశంగా అన్నారు. సీమ ప్రజలను విలన్లుగా సినిమాల్లో చూపడం ఆనవాయితీగా మారిందని, ఇతరులకు సేవ చేసే గుణం తమ ప్రాంతం వారిలో ఉందని ఆయన అన్నారు.

03/30/2016 - 16:54

విజయవాడ: మానవతా విలువలతో వైద్యులు రోగులకు సేవలందించాలని, వ్యాపార ధోరణిని విడనాడాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఇక్కడ బుధవారం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రోగులకు సేవలందించే ముందు ‘ఇన్స్యూరెన్స్ ఉందా?’ అని అడగడం మానేసి వైద్యులు నిజాయితీగా సేవలందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు యువ వైద్యులు కృషిచేయాలన్నారు.

03/30/2016 - 16:53

అనంతపురం: ఇక్కడి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లేడీస్ హాస్టల్‌లో పీజీ విద్యార్థిని పినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం జరిగింది. హాజరుశాతం తక్కువగా ఉన్నందున తనను పరీక్షలకు అనుమతించరేమోనన్న ఆందోళనతో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు వైద్యచికిత్స అందిస్తున్నారు.

Pages