S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/17/2019 - 05:05

నిలబడి ‘సుఖంగా’ ప్రయాణం చేయాలన్నది ‘నిలువున’ పెరుగుతున్న నగరాలలోని జీవన రీతి- లైఫ్ స్టయిల్-! ఆధునిక విలాసం- మోడరన్ ఫాషన్. ఎందుకంటె పద్దెనిమిది ఏళ్లు నిండిన నలబయి ఐదు ఏళ్లు నిండని నాగరిక యువజనులలో అత్యధికులకు- కూచోవడానికి వీలుగా వంగవలసిన- మోకాళ్లు వంగడం లేదు. లావెక్కి ఉన్న నడుములు ఎలాగూ వంగవు. ‘అదేమిటయ్యా? నేలమీద కూర్చొనడానికి కదా నడుములు, మోకాళ్లు వంగవలసిన అవసరం ఉంది..

07/16/2019 - 22:27

తదుపరి ‘దలైలామా’ను తాము నియమిస్తామని చైనా ప్రభుత్వ నిర్వాహకులు ప్రకటించడం దురహంకార ప్రవృత్తికి, దురాక్రమణ చిత్తవృత్తికి మరో నిదర్శనం. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించరాదని, దాన్ని అమలు జరుపడంలో జోక్యం చేసుకోరాదని మన ప్రభుత్వాన్ని చైనా నియంతలు హెచ్చరించడం అక్రమ ఆధిపత్య వైఖరికి, దౌత్య దౌర్జన్యానికి మరో నిదర్శనం.

07/13/2019 - 01:46

తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన సచివాలయ నిర్మాణ పథకం కేంద్ర బిందువుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన రాజధాని నిర్మాణ పథకం కేంద్ర బిందువు కావడం నడచిన చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చరిత్రగతి ‘మందకొడి’ కావడం, తెలంగాణలో ఈ చరిత్ర వేగవంతం కావడం సమాంతర పరిణామాలు!

07/12/2019 - 02:01

‘ఉండేదంతా ఉండంగ ఉయ్యూరొచ్చి మేడూరు మీద పడింద’న్న లోకోక్తికి ఇది మరో ఉదాహరణ.. మిజోరమ్‌లో తలదాచుకుంటుండిన రెండువందల పంతొమ్మిది మంది శరణార్థులను మన అధికారులు బలవంతంగా బర్మాకు తరలించారట. బర్మా-మ్యాన్‌మార్-లోని ‘అరకాన్’- రఖైన్- ప్రాంతంలో ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు ఇస్లాం మతేతరులపై దశాబ్దులుగా దాడులు జరుపుతున్నారు.

07/11/2019 - 01:30

వ్యవసాయపు వాటాల వినిమయ కేంద్రం- అగ్రికల్చరల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్- ఏర్పడకపోవడం దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వైపరీత్యం. ఈ వైపరీత్యం విదేశీయ దురాక్రమణ నాటి వారసత్వం. కొనసాగుతున్న ఈ విపరీత వారసత్వం మన ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న డొల్లతనం. ప్రతి ఏడాది ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’-బడ్జెట్-ఆవిష్కృతం కాగానే ‘వాటాల వినిమయ సూచిక’ పెరుగుతోంది లేదా తరుగుతోంది.

07/10/2019 - 02:40

చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాల ఉమ్మడి దురాక్రమణ పొంచి ఉన్న నేపథ్యంలో మన రక్షణ వ్యయం గణనీయంగా పెరగవలసి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వర్ష ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్‌లో ఈ పెరుగుదల తగినంతగా కనిపించకపోవడం విచిత్రమైన వ్యవహారం.

07/09/2019 - 04:51

జీవన సౌలభ్యం-ఈజ్ ఆఫ్ లివింగ్-గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం హర్షణీయం. జూలై ఐదవ తేదీన పార్లమెంటుకు సమర్పించిన నూతన వార్షిక ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లో జీవన సౌలభ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ నుంచి భారతీయ జీవనం క్రమంగా విముక్తం కాగలదన్న ఆశలు అంకురించడానికి ప్రాతిపదిక! అంకురించిన ఆశలు చిగురిస్తాయా?- అన్నది వేచి చూడదగిన పరిణామం.

07/05/2019 - 21:52

విశ్వాసం వికసిస్తుండడం మరోసారి ఆవిష్కృతమైన దృశ్యం. ‘జాతీయ వికాస ప్రక్రియ’ వేగవంతం అవుతోందన్న విశ్వాసం వికసిస్తోంది. ఇలా వికాసం-ప్రగతి-పట్ల విశ్వాసం వికసించడం- పెంపొందుతుండడం జాతీయ ఇతివృత్తం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నూతన ‘వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-లోని ప్రధాన అంశం ఈ జాతీయ ఇతివృత్తం.

07/05/2019 - 02:02

మన దేశంలో తిష్ఠవేసిన సమయంలో ఘోర నేరాలు చేసిన విదేశీయులు తప్పించుకొని స్వదేశాలకు వెళ్లగలుగుతున్నారు. కొందరు మన యంత్రాంగం కళ్లుగప్పి జారుకున్నారు, మరికొందరు మన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పారిపోగలిగారు. ఇంకొందరు బహిరంగంగా, దర్జాగా, ప్రభుత్వం వారి అనుమతితోను సహకారంతోను విమానాలనెక్కి ఉడాయించారు. కానీ నేరం చేయని మన దేశస్థులు నేరారోపణలకు గురై విదేశాల జైళ్లలో మగ్గుతున్నారు.

07/04/2019 - 02:40

పరాజయానికి బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకునే సంప్రదాయం జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచీ ఆ ‘కుటుంబ’ వారసత్వం కాదు. అందువల్ల ‘ భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించడం ఆశ్చర్యకరం. కానీ, ఇన్నాళ్లపాటు ఆయన అధ్యక్షుడుగా కొనసాగడం మరింత ఆశ్చర్యకరం. లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ ఘోర పరాజయం పాలుకావడానికి బాధ్యత వహించి రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకుంటున్నాడు.

Pages