S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/08/2018 - 22:21

దత్తాత్రేయుడు అత్రి చేసిన తప్ఫఃలం, అనసూయ చేసిన కర్తవ్యనిష్ఠా ఫలం రెండూ కలసి దత్తాత్రేయులుగా రూపుదిద్దుకొంది. అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలి లక్ష్మీపార్వతీసరస్వతులు ముచ్చటపడ్డారు.వారికి నారదుడు తోడయ్యాడు. అమ్మా ఆ అనసూయమ్మ ఇనుపగుగ్గిళ్లను ఉడికించిన తల్లి. ఆమెను పరీక్షించాలనుకొంటే ఏదైనా ఉపద్రవం వస్తుందేమో అని కూడా తన తప్పులేకుండా చెప్పాడు.

02/08/2018 - 22:18

మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.

02/08/2018 - 22:15

శ్లో: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనంధ్రువమ్‌
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం॥
అష్టాదశ పురాణాల్లోని వ్యాసుని మాటలన్నీ సత్యాలే. పరులకుపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం.

02/08/2018 - 22:07

ఒక మంచి పని చేయడంవల్ల పదిమంది మెచ్చుకొంటారు, ఇదే ప్రశంస, దీనినే కీర్తి అంటారు. కీర్తించడం అనే మాటకు పొగడడం అనే అర్థం కూడా వుంది. ఈ కీర్తి ఒక్కచోట ఉండదు. ఆనోటా ఈనోటా పడి దశ దిశల్లో వ్యాపిస్తుంది.

02/08/2018 - 22:05

‘‘పుట్టపర్తి యన్న పుడమి వైకుంఠంబు

02/07/2018 - 21:44

మానవ దేహంలో షట్‌చక్రాలున్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార అనునవి ఆ చక్రాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అను కర్మేంద్రియాలు కంటికి కనబడుతూ ఉంటాయ. వీటి క్రియాస్వరూపాలుగా ‘రూప’ విశేషం మినహా చర్మచక్షువులకు కనబడవు కాని జ్ఞానేంద్రియాలయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు శరీర వ్యాపకాలను నిర్వహిస్తూ వున్నాయి. ఇవి వైద్య శాస్త్ర పరిధికి అందుతుంటాయ.

02/07/2018 - 21:41

ఈ కలియుగంలో కలిగే వింతలన్నింటినీ ఇంతకు పూర్వమే పోతులూరీ వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. వీరు జరుగబోయే కథలను ఆనాడే వివరించారు. కందిమల్లయ్యపల్లెలో నివాసం ఉన్నవీరు సాధారణ గృహస్థుగానే ఉండేవారు. వీరి భార్య గోవిందమ్మ. ఒకసారి ఆ ఊరివారు చందాలు వసూలు చేస్తూ పోతులూరి వీరయ్యగారినికూడా చందాకోసం నిర్బంధించారు. ఆయన నా దగ్గర పైకం లేదన్నారు.

02/07/2018 - 21:11

సనాతన ధర్మస్థాపకుడుగ, విజయనగర సామ్రాజ్య స్థాపకుడుగా సువిఖ్యాతి గాంచిన విద్యారణ్యుల జననం క్రీ.శ. 1268. వీరి పూర్వ నామం మాధవుడు. సన్యాస స్వీకారము తర్వాత మాధవులే విద్యారణ్యుడుగా ప్రసిద్ధిచెందాడు. వీరే హరిహర బుక్కరాయలకు చింతామణి మంత్ర జపం చేసి ఏడు ఘడియలు స్వర్ణవృష్టి కురిసేట్టు చేసి ఆ ధనరాసులను ఆ రాయలకిచ్చి వారి సామ్రాజ్య స్థాపనకు బాసటగా నిలిచారు.

02/07/2018 - 21:05

‘‘సాధన చేయమురా నరుడా సాధ్యం కానిది లేదురా?’’ అని అన్నారు పెద్దలు.
సాధనతో మనం దేనినైనా సాధించగలం. సమకూర్చుకోగలం. సమస్న్నా స్వంతం చేసుకోగలం. సాధనతో మనిషి ‘మనీషి’ అవుతాడు. మహాత్ముడవుతాడు. అందుకనే అన్ని ధనాలలోను విశిష్టమైన ధనం, విలక్షంమైన ధనం సాధనం అని అన్నారు మహనీయులు.

02/06/2018 - 22:12

పరమేశ్వరుడు లేని పదార్థం లేదు.

Pages