S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/07/2017 - 01:29

అమరావతి, మార్చి 6: కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని, బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ బస్సులో రెండో డ్రైవర్ లేడని, అయితే డిక్కీలో పడుకున్నాడని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

03/07/2017 - 01:22

అమరావతి, మార్చి 6: ‘నాయకత్వం సమర్థంగా ఉండి.. శాంతిభద్రతలు కాపాడినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. శ్రుతి మించితే అనర్థాలు తప్పవ’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో కులాలు, మతాల పేరిట చిచ్చు రగులుకుంటున్నందునే శాంతిభద్రతల అంశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

03/07/2017 - 01:21

గుంటూరు, మార్చి 6: ‘నవ్యాంధ్ర పునర్నిర్మాణాన్ని జీరో నుంచి ప్రారంభించాం. సొంత గడ్డపై శాసనసభ సమావేశాల నిర్వహణ చారిత్రాత్మకం. పదేళ్లపాటు హైదరాబాద్‌లో అవకాశం ఉంది. అయితే ప్రజల్లో నమ్మం కలగాలి. వారి మనోభావాలు దెబ్బతినకూడదని ఇక్కడి నుంచయితే సుపరిపాలన సాగుతుందనే లక్ష్యంతో పాలనా వ్యవస్థను ఇక్కడికి తరలించామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

03/07/2017 - 01:12

విజయవాడ, మార్చి 6: ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త శకానికి తెరలేచింది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి సొంత అసెంబ్లీ లేక ఇక్కట్లు పడ్డ రాష్ట్రానికి ఆ కొరత తీరింది. సొంత రాష్ట్రంలో..అదీ సొంత అసెంబ్లీ భవనంలో సోమవారం బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రాష్ట్ర ప్రగతిని కళ్లకు కట్టారు.

03/06/2017 - 08:25

పెదపూడి, మార్చి 5: తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 41 అడుగుల మలేషియన్ మురుగన్ సాలగ్రామ విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం వైభవంగా జరిగింది. విగ్రహ నిర్మాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), పద్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠచేశారు.

03/06/2017 - 08:21

హైదరాబాద్, మార్చి 5: రాష్ట్రంలో అటవీ, ఖాళీ భూములు ఎంతమేరకు ఉన్నాయో లెక్క తేల్చేందుకు సర్వే చేపట్టాలని, ఆవెంటనే కంప్యూటరీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ‘్భ భారతి’ శాఖకు ఈ పనిని అప్పగించింది.

03/06/2017 - 08:02

మహబూబ్‌నగర్, మార్చి 5: కులాల వారిగా గురుకులాలు, మతాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం మంచి పద్ధతి కాదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ ల్లో ఐక్యతా రాగాన్ని దెబ్బతీయడం అవుతుందని సమసమాజ నిర్మాణానికి ఇలాంటి విధానాలు గొడ్డలిపెట్టులా మారుతుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

03/06/2017 - 07:53

హైదరాబాద్, మార్చి 5: ప్రముఖ ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ భువనేశ్వర్ కేంద్రంగా ఛన్రాయ్ ప్రాంగణంలో ఆదివారం న్యూ బోర్న్ ఐ హెల్త్ అలియాన్స్ (నేహో) ప్రారంభించింది. ఒడిషాలో నవజాత శిశువుల నేత్ర సంరక్షణకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఎల్‌వి ప్రసాద్ నేత్ర సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

03/06/2017 - 07:41

హైదరాబాద్, మార్చి 5: తెలుగు రాష్ట్రాల్లో తలసరి వైద్య ఖర్చు రూ.734 ఉంది. గోవా, కేరళతో పోలిస్తే తలసరి వైద్యానికి ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు చేసే వ్యయం తక్కువే. వైద్యానికి, కుటుంబ సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చి వౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం నివేదికలో వెల్లడించింది.

03/05/2017 - 03:56

హైదరాబాద్, మార్చి 4: అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించేలా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన కన్సాస్ కాల్పుల ఘటనలో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లో ఆయన పరామర్శించారు. శనివారం బోరంపేటలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Pages