S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/07/2016 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రాజీవ్ శర్మ మంగళవారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.

12/07/2016 - 02:19

సిద్దిపేట, డిసెంబర్ 6: భూవివాదాల్లో తలదూర్చి నరుూంముఠా పేరిట బెదిరింపులు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట ఎసిపి నర్సింహారెడ్డి వెల్లడించారు. రియల్టర్లను బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం తన చాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు.

12/07/2016 - 02:15

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లా కేంద్రాల్లో ‘కార్యాలయ భవనాల సముదాయా’లను నిర్మించాలని రూపొందించిన ప్రణాళికకు గ్రహణం పట్టింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులే ఇందుకు కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం వంద కోట్ల రూపాయలతో జిల్లా కార్యాలయ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని ప్రతిపాదించారు.

12/07/2016 - 02:08

హైదరాబాద్, డిసెంబర్ 6: గత ఐదు రోజుల్లో అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణను పూర్తిస్థాయి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో సహకరించేందుకు దిగ్గజ బ్యాంకు ఐసిఐసిఐ ముందుకొచ్చింది.

12/07/2016 - 02:06

ఎన్టీఆర్, పైడి జయరాజ్, రఘుపతి వెంకయ్య, కాంతారావు, ప్రభాకర్‌రెడ్డి, సరోజినీనాయుడు పేర్లతో
సినీ అవార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.

12/07/2016 - 01:55

హైదరాబాద్, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేటివిటీ, కల్చరల్ కమిషన్‌ను మంగళవారం నాడు ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు ప్రభుత్వం విశేషాధికారాలను అప్పగించింది. సాంస్కృతిక కళారూపాలను కించపరిచినా, ఏ వ్యక్తుల ప్రయోజనాలకైనా భంగం కలిగించే రీతిలో వ్యవహరించినా చర్యలు తీసుకునే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. పర్యాటక శాఖ అధీనంలో ఈ కమిషన్ పనిచేస్తుంది. ఈ కమిషన్ తెలుగు భాష సంస్కృతి వికాసానికి పనిచేస్తుంది.

12/07/2016 - 01:54

విజయవాడ, డిసెంబర్ 6: ‘మీ మొబైల్ ఫోనే మీ బ్యాంక్.. ఎపి పర్స్ చిరు వ్యాపారులకు ఉపయోగపడుతుంది. ఎపి పర్స్, మార్పు- మీ నేస్తంతో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నోట్ల రద్దు అనంతర పరిణామాలపై బ్యాంకర్లు, ఆర్‌బిఐ ఉన్నతాధికారులతో సిఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి పర్సు అనే యాప్‌ను ప్రారంభించారు.

12/06/2016 - 05:15

విశాఖపట్నం, డిసెంబర్ 5: దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపాన అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. ఇది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారి కొనసాగుతోందని పేర్కొంది. అయితే ఈ అల్పపీడనం చాలా దూరాన ఉందని, రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ కేంద్రం తెలియజేసింది.

12/06/2016 - 03:33

గుంటూరు, డిసెంబర్ 5: మార్గశిర పౌర్ణమి గురుదత్త జయంతి సందర్భంగా విశ్వగురు పీఠంలో ఈ నెల 13న దత్తజయంతి మహోత్సవాలు నిర్వహించనున్నారు.

12/06/2016 - 03:25

విజయవాడ, డిసెంబర్ 5: భారతీయ సంస్కృతిలో బంగారం వినియోగం మిళితమై ఉందని, దానికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం పసిడిపై ఆంక్షలు విధించటం సరికాదని, కేంద్రం ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే మహిళా లోకం ప్రతిఘటిస్తుందని నగర మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) స్థానిక దాసరి భవన్‌లో సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది.

Pages