S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/05/2016 - 04:02

హైదరాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్లు రద్దయి 26 రోజులు గడిచింది. ఆ నోట్లతో బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు మరో 26 రోజుల్లో కాలపరిమితి ముగియనుంది. రద్దయిన 500, 1000 నోట్లతో డిసెంబర్ ఒకటో తేదీ వరకు అన్ని బ్యాంకులకు రూ.9.9 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి.

12/05/2016 - 04:01

మంత్రాలయం, డిసెంబర్ 4: మంత్రాలయం రాఘవేంద్రస్వామి సేవలో తరించిన భద్రగజాన్ని ఆదివారం తిరుపతి జంతుప్రదర్శనశాలకు తరలించారు. వయసు పెరగడంతో జంతుప్రదర్శనశాల క్యూరేటర్ల సూచన మేరకు తరలించాలని మఠం అధికారులు నిర్ణయించారు. దీంతో ఆదివారం గజరాజును అందంగా అలంకరించి మఠం ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు భద్రగజానికి ఇష్టమైన రాగి ముద్ద, చెరుకు, రకరకాల పండ్లు తినిపించారు.

12/05/2016 - 03:57

తిరుపతి, డిసెంబర్ 4: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం పద్మసరోవరంలో పంచమీతీర్థ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య శాస్త్రోక్తంగా సాగింది. ఈ సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తిరుమల నుండి అమ్మవారికి శ్రీవారి సారెను అట్టహాసంగా తిరుచానూరుకు తీసుకొచ్చారు.

12/05/2016 - 03:55

హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

12/05/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 4: వివాహాలకు పెద్ద నోట్ల దెబ్బ బాగా తగిలింది. మంచి ముహూర్తంగా భావిస్తున్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగాల్సి ఉండగా, చాలా మంది వాయిదా వేసుకున్నారు. వచ్చే ఏడాది వేసవిలో మరో మంచి ముహూర్తం చూడాలంటూ వధూవరుల తల్లిదండ్రులు పండితులను ఆశ్రయిస్తున్నారు.

12/05/2016 - 02:09

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ఒకే ఒక్కరోజు సమావేశమైన అసెంబ్లీ ఆ తరువాత వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని పలుమార్లు చెప్పినా కార్యాచరణలోకి రాలేదు. మొత్తం మీద డిసెంబర్ మూడో వారంలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి

12/05/2016 - 02:12

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందించడానికి కార్యాచరణను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

12/05/2016 - 02:02

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18లో కూడా విద్యుత్ చార్జీల వడ్డన అనివార్యంగా కనపడుతోంది. ఈ నెలాఖరుకు రెవెన్యూ లోటు, ఏ మేరకు టారిఫ్ పెంచాలనే దానిపై ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కాంలు ఇవ్వనున్నాయి. ప్రస్తుతానికి రెవెన్యూ అవసరాలపై మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చాయి. దాదాపు ఏడున్నరవేల కోట్ల రూపాయల మేర లోటు ఉంటుందని అంచనా.

12/05/2016 - 01:43

విజయవాడ, డిసెంబర్ 4: జల వివాదాలు వైఎస్ పుణ్యమేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎగువ రాష్ట్రాలు ఇష్టారీతిన ప్రాజెక్టులు కడుతున్నా అప్పటి వైఎస్ సర్కార్ కళ్లు మూసుకు కూర్చుందని, ఫలితం ఇప్పుడనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నియమించిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం మంత్రి దేవినేని నేతృత్వంలో విజయవాడలో ఆదివారం సమావేశమైంది.

12/05/2016 - 01:40

విశాఖపట్నం, డిసెంబర్ 4: గ్రూప్ 3 నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరుకు జారీ చేస్తామని ఎపిపిఎస్‌సి చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. విశాఖ వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. గ్రూప్ 3 ద్వారా 1,055 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

Pages