S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/06/2016 - 03:23

విశాఖపట్నం, డిసెంబర్ 5: స్మార్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పలు రకాలైన, బహుళ ప్రయోజనాలు కలిగి ఉండే పవర్ ప్రాజెక్టులను ప్రవేశపెట్టేందుకు వీలుగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడిసిఎల్) ఆధ్వర్యంలో సోమవారం అమెరికన్, భారతీయ బృందాలు సుదీర్ఘ చర్చ జరిపాయి.

12/06/2016 - 03:21

మార్తి సుబ్రహ్మణ్యం
ఆమె ఒక సైన్యం. ఆ సైన్యానికి రాణి, సేనాని, అంగరక్షకురాలు అన్నీ ఆమెనే. రాజకీయ రణరంగంలో ప్రత్యర్థులను ఒంటరిగానే ఎదుర్కొని ‘జయా’పజయాలను సమానంగా స్వీకరించి, మొక్కవోని ధీరత్వం ప్రదర్శించటం ఆమెకే చెల్లు. ఎంజిఆర్ మరణం అనంతరం ఒంటరిగానే రాణించి.. జీవించి.. వెళ్లిపోయిన మహానేత ఆమె.

12/06/2016 - 02:28

హైదరాబాద్/ వనస్థలిపురం, డిసెంబర్ 5: హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఆల్టో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు రెయిలింగ్‌కు రాసుకుంటూ పల్టీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని నలుగురు యువకులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టిఎస్ 03ఈఎల్ 6551గా గుర్తించారు.

12/06/2016 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 5: ‘ఉద్యోగులకు కడుపు నిండా పెట్టాలి. ఆడుతూ పాడుతూ సంతోషంగా పని చేయించుకోవాలి’ అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్భ్రావృద్ధికి చిత్తశుద్ధితో సిఎం నుంచి అటెండర్ వరకు పని చేయాల్సిందేనన్నారు. ‘సినిమాలో హీరో ఒక్కడే ఉండడు. చాలా పాత్రలు ఉంటాయి. ఎవరి పాత్ర వారు చక్కగా పోషించినప్పుడే సినిమా హిట్టు.

12/06/2016 - 02:18

విజయవాడ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన సిమెంట్‌ను తక్కువ ధరకే సరఫరా చేసేందుకు సిమెంట్ కంపెనీలు ముందుకొచ్చాయి. పోలవరం కాంక్రీటు పనులను డిసెంబర్ 19 నుంచి ప్రారంభించనున్నారు. జనవరిలో డయాఫ్రం వాల్, గేట్ల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చ్యువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.

12/05/2016 - 04:08

కాకినాడ, డిసెంబరు 4: బంగారు ఆభరణాలు కలిగిన వారు మరో 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సిందేనా? పూర్వీకుల నుండి ప్రాప్తించిన బంగారం, పైసా పైసా కూడబెట్టి ఆ ధనంతో సమకూర్చుకున్న ఆభరణాలను ఇక పాత పద్ధతిలో గోడలు, గచ్చుల కింద పాతిపెట్టుకోవల్సిన అగత్యం ఏర్పడిందా? బ్యాంకు లాకర్లలో ఉన్న బంగారానికి భద్రత లేదా? ఏ క్షణాన్నైనా బ్యాంకుల్లోని నగలను సీజ్ చేయమని కేంద్రం నుండి ఆదేశాలు జారీ కానున్నాయా?

12/05/2016 - 04:07

విశాఖపట్నం, డిసెంబర్ 4: పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా ఆదివారం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొనగా, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ నేతృత్వంలో నేవీడే జరిగింది.

12/05/2016 - 04:05

విశాఖపట్నం, డిసెంబర్ 4: అండమాన్ దీవులకు సమీపంగా ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర రూపం దాల్చింది. 24 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

12/05/2016 - 04:04

హైదరాబాద్, డిసెంబర్ 4: సినీ ఫక్కీలో ఓ పోలీస్ అధికారి, కాంగ్రెస్ నేతతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కలసి భారీ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు 24 గంటల్లోనే పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడైన సిఐ రాజశేఖర్‌ను పోలీసులు ఆదివారం విజయవాడలో అరెస్టు చేశారు. కేవలం రూ.18 వేలకే తులం బంగారం ఇస్తామని నమ్మబలుకుతూ ఆయన బంజారాహిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని అక్రమ దందా కొనసాగించారు.

12/05/2016 - 04:03

హైదరాబాద్, డిసెంబర్ 4: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన 26 రోజుల తరువాత కూడా ఎటిఎంలు పని చేయడం లేదు. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి ఆర్‌బిఐ 18 వందల కోట్ల రూపాయల కరెన్సీ పంపించింది. వీటిని జిల్లాలకు తరలించారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితి మెరుగు పడుతుందని, ఎటిఎంలు పని చేస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో ఎటిఎంలు ఏవీ పని చేయలేదు.

Pages