S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/09/2016 - 01:43

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా గురువారం విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ వివరాలను గురువారం ఇక్కడ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

12/09/2016 - 02:03

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 8: హైదరాబాద్ నానక్‌రాం గూడలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కుప్పకూలటంతో కనీసం పదిమంది మరణించినట్లు సమాచారం. పలువురు క్షతగాత్రులయ్యారు. బాధితుల్లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఉండగా మిగతావారంతా విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది.

12/08/2016 - 06:07

నెల్లూరు/ సూళ్లూరుపేట, డిసెంబర్ 7: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. రోదసి పరిశోధనలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. షార్ నుండి స్వర్ణకాంతులు వెదజల్లుతూ నింగిలోకి ఎగసిన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ఇస్రోకు సరికొత్త రికార్డు తెచ్చిపెట్టింది.

12/07/2016 - 04:53

కొత్తపేట, డిసెంబర్ 6: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వడయార్ తయారుచేస్తున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని ఎమ్‌జిఆర్ రీసెర్చ్ యూనివర్సిటీలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంజిఆర్ విగ్రహాలను తయారుచేసి తమిళనాడులో ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

12/07/2016 - 04:52

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్, జయలలిత మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. జయలలిత మృతికి సంతాప సూచకంగా తెలంగాణ సచివాలయంపై అధికారులు జాతీయ జెండాను అవనతం చేశారు. అనంతరం రెండు నిముషాలపాటు వౌనం పాటించారు.

12/07/2016 - 04:51

హైదరాబాద్, డిసెంబర్ 6: ‘అన్నయ్యా’ అని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను అప్యాయంగా పిలిస్తే కడుపు, మనసు సంతోషంతో నిండిపోయేవని దర్శకరత్న దాసరి నారాయణ రావు గద్గద స్వరంతో అన్నారు. అలనాటి ప్రముఖ సినీ నటి, తమిళనాట రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న జయలలిత అస్తమించడం పట్ల సినీ నటులు, దర్శకులు దిగ్భ్రాంతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.

12/07/2016 - 04:50

హైదరాబాద్, డిసెంబర్ 6: నూతన విద్యా విధానం అమలులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మాదిరి ఇండియన్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సర్వీసును ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం దానిపై నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను సైతం స్వీకరించి, వాటిని క్రోడీకరించిన తర్వాత తదుపరి ప్రకటన చేయాలని చూస్తోంది.

12/07/2016 - 04:49

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ ప్రాంతంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో సమైక్య రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడ్డదని, ఈ అంశంపై విచారణ జరిపించాలని సుపరిపాలన వేదిక (్ఫరం ఫర్ గుడ్ గవర్నెన్స్) డిమాండ్ చేసింది.

12/07/2016 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాతబస్తీలో పలు చోట్ల ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం బ్లాక్ డేను పురస్కరించుకుని పత్తర్ గట్టి, బార్కస్, గోల్కొండ, మదీనా, షంషీర్ గంజ్ ప్రాంతాల్లో పలువురు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సరిహద్దులో ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు.

12/07/2016 - 02:23

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలోపేతం కానుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

Pages