S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/04/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 3: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న 15 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 8 లక్షల నగదు, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 24 ఎకరాల స్థలంపై కొందరి కన్నుపడింది.

12/04/2016 - 03:43

హైదరాబాద్, డిసెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబాలు, సామాన్యులు నగదురహిత వ్యవహారాలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ కోరారు. నగదురహిత కార్యకలాపాలను కొనసాగించే అంశంపై అవగాహన కల్పించేందుకు సచివాలయంలో ఉద్యోగులకు ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు.

12/04/2016 - 03:26

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సామాజిక పింఛన్ల కింద ఎకాఎకి రూ.397 కోట్ల నిధులు విడుదల చేసింది. ఆ నిధులు బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిల్లర కష్టాలతో పింఛనుదారులకు నగదు చెల్లింపులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పింఛనుదార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

12/04/2016 - 03:14

అమరావతి, డిసెంబర్ 3: పెద్దనోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తూ మరోవైపు నగదు రహిత విధానం కోసం ఇ-పోస్ మిషన్లు తెప్పించడం కోసం చేస్తున్న కృషి ఫలించింది.

12/04/2016 - 03:04

యలమంచిలి, డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూ.150 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

12/04/2016 - 03:03

హైదరాబాద్, డిసెంబర్ 3: ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పేదలకు వైద్య సేవలు అందించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కోట్లాది పేదలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీని అనారోగ్యశ్రీగా మార్చరాదని, ఈ పథకానికి పాడె కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు.

12/03/2016 - 05:15

తిరుపతి, డిసెంబర్ 2: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్థన గిరిధారియైన శ్రీకృష్ణుని రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వాహనసేవ సాగింది.

12/03/2016 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 2: రానున్న మూడున్నర దశాబ్దాల కాలంలో యాంటీబయాటిక్స్ కూడా పని చేయని పరిస్థితుల వల్ల 30 కోట్ల మంది మరణించే పరిస్థితి ఉంటుందని సిఎన్‌ఆర్‌ఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీని కావేరి హెచ్చరించారు. మితిమీరిన పరిమాణంలో, లేదా అవసరంతో నిమిత్తం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అవి పని చేయని పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పారు.

12/03/2016 - 05:13

హైదరాబాద్, డిసెంబర్ 2: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ నితిన్ ఉపాధ్యాయ పరిశోధనా పత్రానికి ప్రశంసలు వచ్చాయి. క్రమపద్ధతిలో ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడంపై ఆయన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

12/03/2016 - 05:12

హైదరాబాద్, డిసెంబర్ 2: భారతీయులకు కేటాయించే వీసాలపై న్యూజిలాండ్ కోత విధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది శాపంగా మారనుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో న్యూజిలాండ్‌లో చదువుకునే విద్యార్థులకు కేటాయించిన వీసాలు సగానికి తగ్గాయి. కేవలం జూలై నుండి అక్టోబర్ వరకూ న్యూజిలాండ్ భారతీయ విద్యార్థులకు 3102 వీసాలను మాత్రమే మంజూరు చేసింది.

Pages