S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/04/2016 - 02:13

హైదరాబాద్, నవంబర్ 3: లక్షిత దాడులకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆధారాలు చూపాలని అనడం సిగ్గుచేటని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. సైనికులను అవమానపరిచేవిధంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ సైనికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

11/04/2016 - 02:03

హైదరాబాద్, నవంబర్ 3: మిషన్ కాకతీయ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఏడాది కాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. వచ్చే యాసంగి పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రైతుల పొలాలకు నీళ్లందించి తీరాలని నిర్ణయించింది.

11/04/2016 - 02:01

హైదరాబాద్, నవంబర్ 3: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీలుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు గతంలోనే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడానికి అవసరం అయిన ప్రక్రియను ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.

11/04/2016 - 02:00

హైదరాబాద్, నవంబర్ 3: జిల్లాల పునర్విభజన తర్వాత కలెక్టర్లు అందరూ ఉత్సాహంగా, ప్రో యాక్టివ్‌గా పని చేస్తున్నందున భూ సేకరణ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూ సేకరణ అత్యంత కీలకమని దీనికి ప్రతి కలెక్టర్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

11/04/2016 - 01:50

గుంటూరు, నవంబర్ 3: వ్యాపారంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, సంపద పెరగాలంటే పెట్టుబడులను ఆహ్వానించక తప్పదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, కమ్యూనిస్టు చైనా దేశాలు సైతం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయని ఉదహరించారు. సంపద పెరగాలంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తప్పనిసరన్నారు. దేశం ముందుకెళ్లాలంటే రాష్ట్రాలు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.

11/04/2016 - 01:48

గుంటూరు, నవంబర్ 3: నవ్యాంధ్ర రాజధానిలో 15 అంతర్జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పేందుకు విద్యావేత్తలు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విట్‌కు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సమాచార, సాంకేతిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. ‘విద్యార్థులను చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి.

11/04/2016 - 01:47

అమరావతి, నవంబర్ 3: రాష్ట్రంలో ఉచిత వైద్యసేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం చేసేందుకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచిన ప్రభుత్వం, తాజాగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి అంశాలను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 421 ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి.

11/04/2016 - 01:44

హైదరాబాద్, నవంబర్ 3: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ సురక్షితంగా ఉన్నాడని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గురువారం రాత్రి ప్రకటించారు. అయితే ఆర్కే ఎక్కడ ఎలా ఉన్నారో మాత్రం వరవరరావు వివరాలు వెల్లడించలేదు. కాగా ఈ విషయంపై ఆంధ్ర డిజిపి సాంబశివరావు స్పందిస్తూ మావోయిస్టులు, ఆ పార్టీ సానుభూతిపరులు మైండ్ గేమ్ ఆడుతున్నారని, గత ఇరవై ఏళ్లుగా వారు ఈ పద్ధతికి అలవాటుపడ్డారన్నారు.

11/03/2016 - 07:19

విజయవాడ, నవంబర్ 2: దేశాన్ని, రాష్ట్రాన్ని అత్యంత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కృషి చేయాలని విశ్వంజీ విశ్వంభర యోగి మహరాజ్ పిలుపునిచ్చారు. విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా ‘దైనందిన జీవితంలో నీతి నిజాయితీ నైతిక విలువలు’ అనే అంశంపై బుధవారం నగరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో స్వామీజీ మాట్లాడారు.

11/03/2016 - 06:09

హైదరాబాద్, నవంబర్ 2: ఒడిశాలోని మల్కన్‌గిరిలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లో ఆత్మరక్షణార్ధం మాత్రమే పోలీసులు మావోయిస్టులపై కాల్పులు జరిపారని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తమ రాష్ట్ర పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

Pages