S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/04/2016 - 03:42

భద్రాచలం, నవంబర్ 3: అనుకున్నట్లుగానే మావోయిస్టుల బంద్ ఉద్రిక్తతలు రేపింది. ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ మావోలు, పోలీసులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర బంద్‌కు మావోలు పిలుపునివ్వడంతో గురువారం సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఉనికి కోసం ఇరువర్గాలు సై అంటే సై అన్నాయి.

11/04/2016 - 02:29

విజయవాడ, నవంబర్ 3: ఆలయ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివిధ ఆలయాలను కలుపుతూ నాలుగు కారిడార్లను ఇప్పటికే గుర్తించింది. ఈ కారిడార్లలో టూర్లు నిర్వహించేందుకు వీలుగా టూర్ ఆపరేటర్లను దేవాదాయ శాఖ ప్రోత్సహించనుంది. వివిధ ప్రాచీన ఆలయాలకు ప్రాచుర్యంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించే ఆలయ పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

11/04/2016 - 02:27

తిరుమల, నవంబర్ 3: కార్తీకమాసం నాగుల చవితిని పురస్కరించుకుని గురువారం తిరుమలలో పెద్దశేష వాహన ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలోనికి వేంచేశారు. అక్కడ వారిని బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలతో కూడిన ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో విశేషంగా అలంకరించారు.

11/04/2016 - 02:25

హైదరాబాద్, నవంబర్ 3: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శంషాబాద్ ఎంఎస్ కనె్వన్షన్ సెంటర్‌లో రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్టు, ఆ కార్యక్రమంలో పండిట్ రవిశంకర్ పాల్గొంటారని ఆ సంస్థ ప్రతినిధులు వొల్లం భాస్కరరావు, పి వాణిబాల, హరీశ్, శివశంకర్ తెలిపారు.

11/04/2016 - 04:19

హైదరాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అవరోధాలు తొలగిపోయాయి. రహదారుల విస్తరణకు భూ సేకరణ పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ సమస్య నుంచి గట్టేక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123కు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో 604 కి.మీ నిడివిగల జాతీయ రహదారుల పనులు చేపట్టడానికి మార్గం సుగమం అయింది.

11/04/2016 - 02:20

హైదరాబాద్, నవంబర్ 3: జీవిత ఖైదు పడినవారు శిక్షపై హైకోర్టుకు అపీల్ చేసుకుంటే, బెయిల్ పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కాని ఆ ఖైదీ అప్పటికి ఐదు సంవత్సరాల శిక్షను అనుభవించి ఉండాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇచ్చింది.

11/04/2016 - 02:19

హైదరాబాద్, నవంబర్ 3: ఐసిఐసిఐ వేతన వినియోగదారులకు గృహ రుణాలపై రుణ సదుపాయాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి ఐసిఐసిఐ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్‌గా నామకరణం చేశారు. టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.

11/04/2016 - 02:17

హైదరాబాద్, నవంబర్ 3: బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపకశాఖ జారీ చేసే నో అబ్జెక్షన్ ధ్రువీకరణ పత్రాలకు (ఎన్‌ఒసి) ఇక నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

11/04/2016 - 02:16

న్యూఢిల్లీ, నవంబర్ 3: జిఎస్‌టి పన్ను విధానంలో పేద ప్రజలపై భారం పడకుండా చేయగలిగామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

11/04/2016 - 02:13

హైదరాబాద్, నవంబర్ 3: టిడిపిలో చేరిన నలుగురు వైకాపా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారణ నిమిత్తం హైకోర్టు ధర్మాసనానికి నివేదిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ పి నవీన్ రావు గురువారం ప్రకటించారు.

Pages