S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/30/2016 - 03:30

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరిస్తున్న స్విస్‌చాలెంజ్ విధానంపై విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు గురువారం ప్రకటించింది. స్విస్‌చాలెంజ్‌పై సింగిల్ కోర్టు జడ్జి స్టే ఇచ్చిన విషయం విదితమే. అనంతరం రాష్ట్రప్రభుత్వం అపీల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారిస్తోంది.

09/30/2016 - 03:30

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్‌టిఇ) ఆధ్వర్యంలో అన్నా యూనివర్శిటీ నేషనల్ అవార్డును ఉత్తమ ఉపాధ్యాయుడికి వచ్చే నెలలో అందజేయనున్నట్టు సొసైటీ చైర్‌పర్సన్ కె లాల్ కిశోర్ చెప్పారు. దీంతో పాటు మొత్తం 16 అవార్డులను ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచర్లకు అందజేస్తామని వివరించారు.

09/30/2016 - 03:29

హైదరాబాద్, సెప్టెంబర్ 29: భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నడుమ ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలను సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల్లో నిరంతర తనిఖీలు జరగాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలను ఆదేశించారు.

09/30/2016 - 03:26

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ గడ్డ మీద ఉంటూ చంద్రబాబు జపం చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయాలని ప్రయత్నించే టిడిపి నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి రెండు పార్టీలూ ప్రజల ఆదరణ కోల్పోయి చీకటిలో ఉండిపోయాయని అన్నారు.

09/30/2016 - 03:25

చెన్నై, సెప్టెంబర్ 29: కావేరీ జలాలపై సుప్రీం కోర్టు ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం బేఖాతరు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమైందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు. కర్నాటక వైఖరి కోర్టు ధిక్కారణేనని ఆమె వ్యాఖ్యానించారు. కావేరీ నీళ్లపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.

09/30/2016 - 02:21

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

09/30/2016 - 02:15

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పోస్టులకు పార్టీకి చెందిన సీనియర్లను చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించారు.

09/29/2016 - 08:50

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఒకప్పుడు కంట్రోల్‌రూమ్. ఇప్పుడు అది ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ రూమయింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వినిపిస్తోన్న మాట ఇది. ప్రభుత్వాధినేత స్వయంగా అక్కడే ఉండి, అన్నీ పర్యవేక్షించడం ద్వారా క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టించి, వారిలో బాధ్యత పెంచే ఆధునిక పరిపాలనా ప్రక్రియ ఇది.

09/28/2016 - 07:38

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రతి దేశానికి అంతర్గత, బహిర్గత సమస్యలుంటాయని, వీటిని ఎదుర్కోవడంలో పోలీస్ భద్రత ప్రధానమైందని, దీనికి పోలీస్ శాఖలో సంస్కరణలు అనివార్యమని ఉత్తరప్రదేశ్, అస్సాం మాజీ డిజిపి ప్రకాష్ సింగ్ అన్నారు.

09/28/2016 - 07:35

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను పొందడానికి మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న 400 కెవి విద్యుత్ కేంద్రాన్ని నిర్ణీత గడవులోగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Pages