S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/20/2016 - 02:28

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈనెల 21న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలతో కూడిన అజెండాను ఇరు రాష్ట్రాలకు పంపించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది.

,
09/19/2016 - 05:09

హైదరాబాద్, సెప్టెంబర్ 18: దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విజయవాడ-రాయ్‌చూర్-మచిలీపట్నం మధ్య 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రైన్ నెం. 07243 ప్రత్యేక రైలు ఈ నెల 29, అక్టోబర్ 6,13,20,27, నవంబర్ 3,10వ తేదీల్లో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ నెల 29న రాత్రి గం. 11.10లకు విజయవాడ నుండి బయలుదేరి మరుసటి రోజున ఉ.గం.

09/19/2016 - 05:01

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రతిష్టాకరమైన పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిధులు రానున్నాయి. బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు విదేశీ బ్యాంకులు, విదేశీ ఏజెన్సీలు నిధులు ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రం భరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు బ్యాంకు రుణాలు సమకూర్చుతోంది.

09/19/2016 - 05:00

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూంతో లింకులున్న 30 మంది పోలీసులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీరిలో ఎస్సై, సిఐ, డిఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయిలో అధికారులు ఉన్నారు. వీరంతా నల్గొండ, సైబరాబాద్, హైదరాబాద్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారు ఉన్నట్టు ఓ సీనియర్ సిట్ అధికారి తెలిపారు.

09/19/2016 - 03:08

అనంతపురం, సెప్టెంబర్ 18: ‘పాకిస్తాన్ ఆగడాలు హెచ్చుమీరిపోతున్నాయి.. భారతదేశంలోని భావితరాలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించాలంటే ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి.. దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల పైబడి జనాభాలో 10 కోట్ల మంది ప్రాణాలు పోయినా సరే.. పాక్ అరాచకాలను అణచివేయాలి..

09/19/2016 - 03:05

తిరుమల, సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయించనన్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 6, 7 తేదీల్లో మాత్రం కాటేజీ దాతలకు కూడా ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాటేజీ దాతలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

09/19/2016 - 03:02

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? అనేది సమాధానం లేని ప్రశ్న..’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ రాసిన ‘విభజన కథ’ పుస్తకాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆదివారం ఆవిష్కరించారు.

09/19/2016 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ, మహారాష్టల్రలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, గోదావరి నదిపై ఉన్న శ్రీరాం సాగర్, మంజీరాపై ఉన్న సింగూర్ ప్రాజెక్టుల్లోకి భారీ వరద వస్తోంది. కృష్ణాపై ఉన్న జూరాలలోకి పరీవాహక ప్రాంతం నుండి 48015 క్యూసెక్కుల వరద చేరుతుండటంతో, ప్రాజెక్టు రక్షణను దృష్టిలో ఉంచుకుని 50631 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు.

09/19/2016 - 02:58

హైదరాబాద్, సెప్టెంబర్ 18: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

09/19/2016 - 02:57

విజయవాడ, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు మాత్రం గతాన్ని మరచి అన్నదమ్ముల్లా కలసిమెలిసే ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రి నాయిని తనను కల్సిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

Pages