S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/07/2016 - 06:19

శంఖవరం, జనవరి 6: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో వ్రత పురోహితులపై ఆలయ కార్యనిర్వహణాధికారి (ఇఒ) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనితో బుధవారం వ్రత పురోహితులు నిరసన వ్యక్తంచేశారు. ఆలయ ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ప్రతి నెలా మొదటి మంగళవారం ‘డయల్ యువర్ ఇఒ’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. భక్తులు తన దృష్టికి తీసుకువచ్చే సమస్యలపై ఇఒ ఈ కార్యక్రమం ద్వారా స్పందిస్తుంటారు.

01/07/2016 - 04:42

కర్నూలు, జనవరి 6 ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ఫిబ్రవరి 1 నుంచి నుంచి రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

01/07/2016 - 04:35

హైదరాబాద్, జనవరి 6: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి,ఉపాధ్యాయుల నుంచి 10 రూపాయిలు సేకరించాలన్న ఎపి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. విద్యార్ధుల నుండి విరాళాల సేకరణకు సర్క్యూలర్‌ను ఎలా విడుదల చేస్తారని హైకోర్టు న్యాయమూర్తి పి వి సంజీవ్ కుమార్ ప్రశ్నించారు. విరాళాల సేకరణకు ఆదేశాలు ఇచ్చే అధికారం అధికారులకు లేదని స్పష్టం చేశారు.

01/07/2016 - 04:31

హైదరాబాద్/ కాకినాడ, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్-2016 నిర్వహణ తేదీని మార్చింది. ఈమేరకు ఉన్నత విద్యామండలి నుండి ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాకినాడ జెఎన్‌టియుకు ఉత్తర్వులు అందాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఎంసెంట్- 2016ను ఈ ఏడాది మే 5న నిర్వహించాల్సి ఉంది.

01/07/2016 - 04:30

గుంటూరు, జనవరి 6: గుంటూరు వేదికగా జరిగిన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సుకు హాజరైన రైతులు తమ అభ్యంతరాలను వెల్లడించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని రహదారుల వలన జరుగుతున్న నష్టంపై ఆందోళనతో ఉన్న రైతులు సభకోసం బుధవారం ఉదయమే గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు.

01/06/2016 - 18:09

హైదరాబాద్‌: గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదరరెడ్డి చేశారు.

01/06/2016 - 17:34

హైదరాబాద్‌: కేసెట్‌ కారణంగా ఎంసెట్‌ పరీక్షలను ఏప్రిల్‌ 29న నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. తొలుత ఈ పరీక్షను మే 5న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలను ఆరు రోజులు ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.

01/06/2016 - 13:30

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఐదుగురు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, రూ.19వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

01/06/2016 - 13:28

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలతో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై నామినేషన్ పత్రాలలో 7, 8, 10 కాలమ్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై పోటీ చేసే అభ్యర్థి వార్డు నెంబరు, వార్డు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నెంబరును విధిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

01/06/2016 - 13:21

హైదరాబాద్ : చంద్రబాబు హయాంలో క్లీన్ సిటీగా పేరొందిన హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెత్త సిటీగా మార్చిందని టీడీపీ నగర అధ్యక్షుడు గోపీనాథ్ విమర్శించారు. ఈనెల 9న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ కూటమికి 80-90 మధ్య సీట్లు వస్తాయని సర్వేలు తెలియజేస్తున్నాయని అన్నారు.

Pages