S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/08/2016 - 07:01

హైదరాబాద్, జనవరి 7: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చెన్నై ఎగ్మోర్-హౌరా, హౌరా-ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న నెం.06163 చెన్నై ఎగ్మోర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని తెలిపింది.

01/08/2016 - 07:00

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామపంచాయతికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఇనె్స్పక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఇక నుంచి ఫిర్యాదు దారులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బదులుగా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ‘సైబర్ క్రైం అండ్ సోషల్ మీడియా’పై జరిగిన శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

01/08/2016 - 06:59

హైదరాబాద్, జనవరి 7: హెచ్‌ఎంటి వంటి ఎన్నో సంస్థలను మూసివేసి మేకిన్ ఇండియా ఎలా సాధ్యపడుతుందని సిఐటియు అఖిల భారత ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యులు పతన్‌సేన్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్డ్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతో దేశ ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచుతున్నారని ఆయన విమర్శించారు.

01/08/2016 - 07:45

విశాఖపట్నం, జనవరి 7: యుద్ధ నౌకల తయారీలో డిఆర్‌డిఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) సాంకేతిక సహకారాన్ని వినియోగించుకుంటాం.. స్వదేశీ సాంకేతికత వినియోగానికి సంబంధించి డిఆర్‌డిఓతో 15 ఏళ్లకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ తెలియచేశారు.

01/08/2016 - 06:29

విజయవాడ, జనవరి 7: జలవనరులపై జనచైతన్యం తీసుకువచ్చేందుకు గ్రామాల్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇకపై ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ ప్రాంతంలో వున్న జలవనరులపై మ్యాప్‌లతో కూడిన సచిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

01/08/2016 - 06:26

హైదరాబాద్, జనవరి 7: ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రలోనూ టెన్త్ విద్యార్థులకు ఎర వేసే జిమ్మిక్కులను ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు ప్రారంభించాయి. ఫీజు రాయితీలు, ఉచిత భోజనం, ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించడంతో పాటు ప్రతిభ గల విద్యార్థులకు అదనపు ఆకర్షణలు కూడా కల్పిస్తున్నాయి.

01/08/2016 - 06:25

హైదరాబాద్, జనవరి 7: ప్రతిష్టాత్మక కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ పురస్కారం ఈ ఏడాది గరిమెళ్ల అచ్యుత సత్యశేషగిరి సోమయాజులు శర్మకు ప్రదానం చేస్తున్నట్లు నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ ఒక ప్రకటనలో తెలిపారు.

01/08/2016 - 05:15

తిరుపతి, జనవరి 7: రాజధాని అమరావతి నిర్మాణానికి ఎవరివద్దా బలవంతంగా విరాళాలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మూడో విడత జన్మభూమిలో భాగంగా గురువారం తిరుపతికి విచ్చేసిన చంద్రబాబు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

01/08/2016 - 05:14

కాకినాడ, జనవరి 7: గ్రూప్-1 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీకానుందని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. డిఎస్సీ ద్వారా రాష్ట్రంలో సుమారు 9వేల టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీచర్లు, డాక్టర్లు తదితర ప్రాముఖ్యత కలిగిన పోస్టులను కాంట్రాక్టు విధానంలోనూ భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

01/08/2016 - 05:10

హైదరాబాద్, జనవరి 7: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నేటి నుంచి 14 వరకు 2698 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండి ఎన్ సాంబశివరావు వెల్లడించారు. ప్రత్యేక బస్సులకుతోడు 486 రెగ్యులర్ సర్వీసులనూ తిప్పుతున్నట్టు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో దాదాపు 1200 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్య కల్పించామన్నారు. 8నుంచే రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు.

Pages