S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/08/2016 - 16:11

న్యూఢిల్లీ : ఢిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ)అవతవకలపై విచారణ కోసం కేజ్రీవాల్‌ ఏర్పాటుచేసిన కమిటీ అక్రమమైందని, చట్టవ్యతిరేకమని తెలుపుతూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కార్యాలయం నుంచి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నజీబ్‌ జంగ్‌ సెక్రటరీ పేరుతో ఈ నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆప్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది.

01/08/2016 - 16:05

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం ఈ సమ్మె జరుగుతోంది.

01/08/2016 - 16:00

న్యూఢిల్లీ : ‌: పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ స్నేహితుడు, నగల వ్యాపారి రాజేశ్‌వర్మ అధికారులు ప్రశ్నించారు. పలు కోణాల్లో విచారించిన అధికారులు రాజేశ్‌ నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

01/08/2016 - 13:45

హైదరాబాద్ : కృష్ణానగర్‌లో డబ్బింగ్ ఆర్టిస్టు శకుంతల ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డబ్బింగ్ ఆర్టిస్టు అసోసియోషన్ అధ్యక్షుని వేధింపులే కారణమని శకుంతల తల్లిదండ్రులు ఆరోపించారు.

01/08/2016 - 13:44

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని భాజపానేతలు శుక్రవారంనాడు గవర్నర్‌ను కలిశారు. భాజపా శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో నేతలు గవర్నర్‌ను కలిశారు.

01/08/2016 - 13:42

హైదరాబాద్ : విలేకరుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు పాత్రికేయుల ఆరోగ్య కార్డుల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులకు ఇచ్చిన అన్ని వాగ్ధానాలను అమలుచేస్తామని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఆరోగ్యకార్డులను పంపిణీ చేశారు.

01/08/2016 - 07:38

హైదరాబాద్, జనవరి 7: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సరుూద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటిదాకా రాజకీయంగా తమకు ఎంతో అండగా నిలిచిన ముఫ్తీ మహ్మద్ సరుూద్ లేని లోటు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని ముఖ్యమంత్రి కెసిఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

01/08/2016 - 07:05

హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసి)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఫిబ్రవరి 18న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్మిక శాఖ అదనపు కమిషనర్ సూర్యప్రసాద్ సమక్షంలో గురువారం జరిగిన రెండోవిడత ఆర్టీసి కార్మిక సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

01/08/2016 - 07:04

హైదరాబాద్, జనవరి 7: వచ్చే రెండేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాలు, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించి భారీ ఎత్తున రూ.64,195 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2016,2017 సంవత్సరాల్లో గ్యాస్ రంగంలో రూ. 1850 కోట్లు, పోర్టుల్లో రూ. 4443 కోట్లు, విమానాశ్రయాల్లో రూ.3359 కోట్లు, సామాజిక వౌలిక సదుపాయాల్లో రూ. 590 కోట్లు, ఫైబర్ గ్రిడ్‌లో రూ.333 కోట్లు, బీచ్ కారిడార్‌లో రూ.

01/08/2016 - 07:03

హైదరాబాద్, జనవరి 7: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు బహుముఖీన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం తగ్గలేదని తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. అన్ని రకాల ప్రమాదాలు తీసుకుంటే ప్రతి నిమిషం 16 మంది మృతి చెందుతున్నారు. వంద మందికి పైగా గాయపడుతున్నారు.

Pages