S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/08/2016 - 05:08

కడప, జనవరి 7: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని ప్రకటిస్తారని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి గురువారం విస్తృతంగా పర్యటించారు.

01/07/2016 - 17:36

మెదక్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించటమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. జిల్లాలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీకి రూ.75 కోట్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు.

01/07/2016 - 17:32

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుజీఓపై హైకోర్టు స్టే ఇచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణకు గడువును పొడిగించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 31రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తిచేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.

01/07/2016 - 15:20

హైదరాబాద్‌: కోడి పందాలు నిర్వహించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

01/07/2016 - 13:11

హైదరాబాద్‌: విజయవాడలోని రైల్వే కల్యాణమండపంలో దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీంద్రగుప్తాతో సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు బహిష్కరించారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకని ఎంపీలు ప్రశ్నించారు. సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎంపీలంతా బయటకు వచ్చారు.

01/07/2016 - 07:27

హైదరాబాద్, జనవరి 6: గ్రేటర్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, గ్రేటర్ పరిథిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఇంకా ఈ నెల 9న నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

01/07/2016 - 07:20

నంద్యాల, జనవరి 6: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. వీల్‌చైర్‌లో ఉన్న ఎస్పీవైరెడ్డి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవైరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.

01/07/2016 - 07:20

ఆదోని, జనవరి 6: రాష్ట్రంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు దిగజారిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తుగ్గలి మండలం రాతన గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను గతంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీరామరావు హయాంలో మంత్రిగా పని చేశానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించానన్నారు.

01/07/2016 - 07:19

హైదరాబాద్, జనవరి 6: ఆంధ్రా డిస్కాంలు రూ.5700 కోట్ల విద్యుత్ లోటును పూడ్చేందుకు విద్యుత్ టారిఫ్ పెంపుదలపై కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. దీని ప్రకారం విద్యుత్ వాడకం రెండు వందల యూనిట్లు దాటితే సవరించిన విద్యుత్ చార్జీలు వర్తించే విధంగా చూడాలని ఏపిఇఆర్‌సిని కోరనున్నాయి. అంటే రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి విద్యుత్ చార్జీలు పెరగవు.

01/07/2016 - 07:18

హైదరాబాద్, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు రాష్ట్ర ప్రణాళికా వ్యయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దిశలోనే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఆదేశాలు, సూచనల మేరకే వివిధ శాఖలు తమ బడ్జెట్‌ను (2016-17) రూపొందిస్తున్నాయి. గతంలో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కొంత కాలం పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖను చంద్రబాబు నిర్వహించారు.

Pages