S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/25/2018 - 01:01

గుంటూరు, మార్చి 24: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఎంత కేటాయించారో వాస్తవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ‘ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు’ అనే అంశంతో పాటు బీజేపీ చీఫ్ అమిత్‌షా రాసిన లేఖపై చంద్రబాబు శనివారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. లేఖను తప్పుల తడక, కట్టుకథగా అభివర్ణించారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఆందోళనలో ఉందన్నారు.

03/24/2018 - 04:04

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి తెరాసకు వెళ్లిన కలె యాదయ్య, రెడ్యానాయక్, భాస్కర్ రావు, చిట్టం రామ్మోన్‌రెడ్డి, కొరం కనయ్య, విఠల్‌రెడ్డి, అజయ్‌కుమార్‌లు విప్ ధక్కరించారని అన్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

03/24/2018 - 01:14

హైదరాబాద్, మార్చి 23: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలక శాఖా మంత్రి కె తారక రామారావు చెప్పారు. శాసనసభలో శుక్రవారం 9 పద్దులపై జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణను వివరించారు. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు దశలవారీ ఎలక్ట్రానిక్ కార్లను ప్రవేశపెడతామన్నారు.

03/24/2018 - 01:11

హైదరాబాద్, మార్చి 23: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఘన విజయం సాధించింది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

03/24/2018 - 03:53

అనంతపురం, మార్చి 23: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ శుక్రవారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పుట్టపర్తి చేరుకున్న నరసింహన్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మండపంలోకి చేరుకుని అక్కడ ఉన్న సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

03/24/2018 - 04:03

విజయవాడ: తెలుగువారికి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా గతంలో ప్రకటించిన విధంగా ఆదివారం కాకుండా 26న సోమవారానికి సెలవును మార్పుచేస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం జీవో 679 నెంబర్‌తో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం సెలవుదినంగా ప్రకటిస్తూనే ఆ రోజు జరిగే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసింది.

03/24/2018 - 04:01

సత్యవేడ: దేశంలోనే అతిగొప్ప ఆటోమోటివ్ హబ్‌గా ఆంధ్రను అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఈక్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హీరో మోటార్స్ పరిశ్రమ చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. సత్యవేడు మండలం మాదనపాళ్యంలో నెలకొల్పిన హీరో మోటార్స్ పరిశ్రమ 2019 మార్చికి తొలి ఉత్పత్తులు ప్రారంభించాలన్నారు.

03/24/2018 - 04:00

అమరావతి: రానున్న రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాల తయారీ లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు వాహన తయారీదారులకు సూచించారు. ఈ సందర్భంగా 2018ని ఎలక్ట్రిక్ వాహన సంవత్సరంగా ప్రకటించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడంతో, యువతకు విస్తృతంగా ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీరంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. తయారీదారులకు భారీగా ప్రోత్సాహకాలు కల్పిస్తూ త్వరలోనే పాలసీని రూపొందిస్తామని చెప్పారు.

03/24/2018 - 03:54

భద్రాచలం టౌన్, మార్చి 23: సీతారాముల కల్యాణానికి భద్రాద్రి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. స్వాగత ద్వారాలు, భక్త రామదాసు కీర్తనలతో భద్రాద్రి పూర్తిగా భక్తాద్రిగా మారిపోయింది. రామాలయానికి విద్యుద్దీపాలంకరణలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

03/24/2018 - 00:46

అమరావతి, మార్చి 23: ఏన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీపై వరుసగా జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలను ముఖ్యంగా ఏపీని దెబ్బతీసేందుకు మూడు పార్టీల కుట్రలను ప్రజలతో కలిసి తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని బలహీనపర్చేందుకు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

Pages