S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/05/2017 - 03:54

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెరాస సభ్యుడు ఏఎస్‌ఆర్ నాయక్ ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయక్ శుక్రవారం లోక్‌సభలో విశాఖపట్నంలో భారత పెట్రోలియం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన ఎనర్జీ బిల్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏపిలో పట్రోలియం పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయటం తమకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.

08/05/2017 - 03:54

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను పాఠశాల విద్య కమిషనర్ జి కిషన్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషదన్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఫలితాలను విడుదల చేస్తూ, పేపర్-1లో 57.37 శాతం, పేపర్-2లో 19.51 శాతం ఉత్తీర్ణులైనట్టు చెప్పారు.

08/05/2017 - 03:53

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు అతి వృష్టి, మరో వైపు అనావృష్టి పరిస్ధితులు నెలకొన్నాయి. అతి వృష్టి ఉన్న ప్రదేశంలో తెలంగాణ రూపురేఖలను మార్చేయనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.

08/04/2017 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 3: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్ నియోజకవర్గ ప్రజల సానుభూతి కోసం కాల్పుల హైడ్రామా ఆడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం విక్రమ్‌గౌడ్ డిశ్చార్జ్ అయి వీల్‌చైర్‌పై ఉండగా వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల ఘటనలో బుధవారం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే.

08/04/2017 - 02:54

హైదరాబాద్, ఆగస్టు 3: సిఎం కెసిఆర్ ఓ అబద్దాల కోరు, ఒక మాటకు మాట పొంతన ఉండదు, రాత్రి మాట్లాడింది పొద్దున ఉండదు అంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే కెసిఆర్ ప్రేలాపనలకు దిగారన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ పట్ల కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు.

08/04/2017 - 02:51

హైదరాబాద్, ఆగస్టు 3: మూడేళ్ల కెసిఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం నింపిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు మాట్లాడారు. ఏ ఒక్క పార్టీ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ రాష్ట్రం రాలేదని, బరిగీసి కొట్లాడితే తెలంగాం వచ్చిందని అన్నారు.

08/04/2017 - 02:45

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితితో రైతులు విలవిలలాడుతున్నారు. జూన్‌లో నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో తక్కువ వర్షాపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ (పాతవి) జిల్లాల్లో 20 నుండి 30 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది.

08/04/2017 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 3: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసు విచారణ నేపథ్యంలో రైల్వే శాఖ నిఘా పెంచింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా రైళ్లలో మాదకద్రవ్యాలను తరలిస్తుందని డ్రగ్స్ రవాణాపై దృష్టిసారించాలని డిజిపి (రైల్వే, రోడ్డు భద్రత) టి కృష్ణప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇటీవల రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టింది.

08/04/2017 - 02:07

హైదరాబాద్, ఆగస్టు 3: రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మేందుకు నిర్ణయించినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా ఫ్లాట్లను విక్రయించనున్నట్లు వెల్లడించారు. మొదటి దశగా బండ్లగూడ, పోచారంలో నిర్మించిన 3,719 ప్లాట్లను విక్రయించనున్నట్లు తెలిపారు.

08/04/2017 - 02:06

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్‌ఆర్‌ఓ)కు త్వరలో సొంత బ్యాండ్‌విడ్త్‌ను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సమయంలో తలెత్తే తప్పిదాలు, సర్వర్ చాలా సార్లు మొరాయించడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు సొంత బ్యాండ్‌విడ్త్‌ను ఏర్పాటు చేసుకోబోతోంది.

Pages